Chitrajyothy Logo
Advertisement
Published: Mon, 23 May 2022 17:21:01 IST

Ante Sundaraniki: చచ్చేట్టు గిచ్చిందిరా.. ఆసక్తికరంగా థర్డ్ సింగిల్

twitter-iconwatsapp-iconfb-icon
Ante Sundaraniki: చచ్చేట్టు గిచ్చిందిరా.. ఆసక్తికరంగా థర్డ్ సింగిల్

నేచురల్ స్టార్ (Natural Star) నాని (Nani) హీరోగా.. వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki). నాని సరసన నజ్రియా ఫహద్ (Nazriya Fahadh) హీరోయిన్‪గా నటిస్తోంది. ఈ చిత్ర థర్డ్ సింగిల్‪ను సోమవారం మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించి సంగీత దర్శకుడు వివేక్ సాగర్ (Vivek Sagar) స్వరపరిచిన ఫస్ట్ సింగల్ ‘పంచెకట్టు’, సెకెండ్ సింగల్ ‘ఎంత చిత్రం’ పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్‪గా నిలిచాయి. తాజాగా విడుదలైన మూడో పాట కథలో సుందరం పాత్ర పరిస్థితిని హిలేరియస్‪గా ప్రజంట్ చేస్తూ.. సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. సంగీత దర్శకుడు ఈ పాటని చాలా డిఫరెంట్‪గా కంపోజ్ చేశారు. సనాపతి భరద్వాజ పాత్రుడు (Sanapati Bharadwaj Patrudu) అందించిన సాహిత్యం క్యాచిగా వినోదాత్మకంగా వుంది.

  

‘‘అనుకున్నదోటి  

అయ్యిందోటి

రంగో రంగా..

మొక్కిందోటి..  దక్కిందోటి

రంగో రంగా..  

నీకుంది నిక్కచ్చి పిచ్చి

కాలంకి నీపైన కచ్చి

అచ్చోచ్చినట్టే తానొచ్చి

అప్పచ్చి ఇచ్చేటి మాటిచ్చి

మచ్చోటి వచ్చేట్టు చచ్చేట్టు గిచ్చిందిరా’’ అంటూ సాగిన ఈ పాట సాహిత్యం, నాని ఎక్స్‪ప్రెషన్స్ హిలేరియస్‪గా వున్నాయి. కారుణ్య (NC Karunya) ఈ పాటను చాలా ఎనర్జిటిక్‪గా ఆలపించారు. ఈ లిరికల్ సాంగ్‪లో సెట్స్‪లో జరిగిన సరదా విజువల్స్ కూడా చూపించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‪లో టాప్‪లో ట్రెండ్ అవుతోంది. కాగా, ఈ చిత్రం తమిళ వెర్షన్‌లో ‘అడాడే సుందరా’ (Adade Sundara), మలయాళ వెర్షన్‌లో ‘ఆహా సుందరా’ (Aha Sundara) అనే టైటిల్‌తో విడుదలకానుంది.  జూన్ 10న మూడు భాషల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‪గా విడుదలకానుంది.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International