Advertisement
Advertisement
Abn logo
Advertisement

తుమ్మలగుంట చెరువు తప్పిదానికి సమాధానం చెప్పండి!

తిరుపతి వరదలపై చంద్రబాబు సూటి ప్రశ్న


‘‘తిరుపతి ఎగువన మూడు చెరువులున్నాయి.... వాటిలో ఒకటైన పెరుమాళ్ళపల్లి చెరువు తెగిపోయింది... ఆ నీరు పేరూరు చెరువులోకి వచ్చాయి... అది నిండాక నీరంతా తుమ్మలగుంట చెరువుకు వెళ్ళాలి... అక్కడి నుంచీ స్వర్ణముఖి నదిలో కలవాలి.... అయితే తుమ్మలగుంట చెరువును క్రికెట్‌ స్టేడియం చేశారు...దాంతో తుమ్మలగుంట చెరువులోకి పోవాల్సిన నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి?... అవి పద్మావతీ మహిళా యూనివర్శిటీకి వెళ్ళాయి...దాంతో యూనివర్శిటీ నుంచీ ఆటోనగర్‌ వరకూ... రైల్వే ట్రాక్‌తో సహా ఆ ప్రాంతమంతా జలమయమైపోయింది... నగరమంతా 8 నుంచీ 9, 10 అడుగుల ఎత్తున నీరు వచ్చేసింది.... రాయలచెరువుకు చిన్న లీక్‌ అయితే దాన్ని అరికట్టి మరమ్మతు చేయాలి... ప్రజలకు భరోసా ఇవ్వాలి... అదేమీ చేయకుండా మామూలు వ్యక్తులతో చెరువు కట్ట లీకేజీ రిపేరీ చేపిస్తారా?... రాయలచెరువు కట్ట కనుక తెగి వుంటే 30 గ్రామాలు జలమయమైపోయేవి...చాలా ప్రాణ, ఆస్తినష్టం జరిగివుండేది... ఇది తప్పిదం కాదా? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి’’..... 


- మంగళగిరిలో శనివారం మీడియాతో మాట్లాడుతూ తిరుపతి వరదలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి. 

Advertisement
Advertisement