చిత్తూరు జిల్లాలో గజ బీభత్సం

ABN , First Publish Date - 2020-09-28T10:12:08+05:30 IST

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో ఆదివారం తెల్లవారుజామున ఒంటరి మదపుటేనుగు దాడిలో ఒక

చిత్తూరు జిల్లాలో గజ బీభత్సం

ఏనుగు దాడిలో మరో మహిళ మృతి, రైతుకు గాయాలు 


కుప్పం, సెప్టెంబరు 27: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో ఆదివారం తెల్లవారుజామున ఒంటరి మదపుటేనుగు దాడిలో ఒక మహిళ మృతి చెందగా, గుడుపల్లె మండలానికి చెందిన మరో రైతు తీవ్ర గాయాలపాలయ్యాడు. శాంతిపురం మండలం సి.బండపల్లె సమీపం రాళ్లపల్లెలో ఆదివారం తెల్లవారుజామున పాపమ్మ (60) తన ఇంటిపక్కనే ఉన్న వరిపొలంలోకి రాగా, అక్కడే ఉన్న మదపుటేనుగు దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇదే ఏనుగు అక్కడినుంచి పొలాల్లో పంటను తొక్కుకుంటూ గుడుపల్లె మండలంలో ప్రవేశించింది. పొగురుపల్లె పంచాయతీ చింతరపాళ్యం సమీపంలో రైతు నారాయణప్ప(59)పై దాడి చేసి గాయపరిచింది. దీనిని గమనించిన పరిసర రైతులు కేకలు పెడుతూ, డప్పులు కొడుతూ ఏనుగును తరిమేశారు. తలకు తీవ్ర గాయమైన నారాయణప్ప కుప్పం పీఈఎస్‌ ఆసుపత్రిలో చికి త్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఏనుగుల దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు నష్టపరిహారంగా ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. గాయపడ్డ వారికి చికిత్స నిమిత్తం రూ.3 లక్షలు తక్షణ సాయం అందించాలని కోరారు.

Updated Date - 2020-09-28T10:12:08+05:30 IST