మరో సారి వరద బెంగ

ABN , First Publish Date - 2022-08-10T05:38:29+05:30 IST

గోదావరి నదీ పరివాహక ప్రాంతవాసులకు మరోసారి వరద బెంగ పట్టుకుంది. ్ఠజూలైలో వచ్చిన భారీ వరదలను మరువకు ముందే మళ్లీ గోదావరికి వరదలు వస్తు

మరో సారి వరద బెంగ

 భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

మొదటి ప్రమాద హెచ్చరిక జారీ 

నేడు 55అడుగులకు చేరుకునే అవకాశం 

పర్ణశాలలో నీట మునిగిన నార చీరల ప్రాంతం

అధికారులు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కలెక్టర్‌ ఆదేశాలు

భద్రాచలం, ఆగస్టు 9:  గోదావరి నదీ పరివాహక ప్రాంతవాసులకు మరోసారి వరద బెంగ పట్టుకుంది.  ్ఠజూలైలో వచ్చిన భారీ వరదలను మరువకు ముందే మళ్లీ గోదావరికి వరదలు వస్తున్నాయి. ఎగువన ప్రాణహిత, ఇంద్రావతి నుంచి భారీగా వరద వస్తుండటం, దిగువన శబరి  ఉగ్రరూపం దాల్చడంతో ఎగపోటు కారణంగా భద్రాచలం వద్ద నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. సోమవారం అర్ధరాత్రి 12గంటలకు 36.8అడుగులున్న గోదావరి నీటిమట్టం మంగళవారం రాత్రి 8గంటలకు 45.2 అడుగులకు చేరుకోగా.. రాత్రికి రెండో ప్రమాద హెచ్చరిక(48 అడుగులు)ను దాటి బుధవారం 55అడుగులకు చేరుకునే అవకాశం ఉందని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. గోదావరి వరద నేపఽథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కలెక్టర్‌ అనుదీప్‌ ఆదేశించారు. ముంపు మండలాల ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని సూచించారు. పశువులను బయటకు వదలకుండా ఇంటి వద్దే జాగ్రత్తగా ఉంచాలని, జాలర్లు చేపల వేటకువెళ్లవద్దని ఆయన సూచించారు. 

చర్ల మండలంలో వరద బాధితుల తరలింపునకు చర్యలు

చర్ల మండలంలోని దండుపేట, కొత్తపల్లి వరద బాధితులను తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దండుపేట-కొత్తపల్లి రహదారిపై గోదావరి వరద నీరు చేరింది. కాగా 50అడుగులు వస్తే దండుపేటవాసులను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులు ఆదేశాలు ఇవ్వడంతో ఆ దిశగా మండల అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. గోదావరి మూడో ప్రమాద హెచ్చరిక సైతం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తుండటంతో కొత్తపల్లివాసులను తరలించే యోచనలో అధికారులు ఉన్నారు. ఇదిలా ఉండగా దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాలలలో ఉన్న నారచీరల ప్రాంతం ఇప్పటికే నీట మునిగింది. భద్రాచలం వద్ద దేవస్థానం కల్యాణకట్ట కింది భాగానికి వరద నీరు చేరింది. గోదావరి చరిత్రలో ఇప్పటివరకు ఆగస్టులో 35సార్లు గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించింది. 2020ఆగస్టు 17న అత్యధికంగా 61.6 అడుగుల వద్ద ప్రవహించింది. ప్రస్తుతం 11లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వస్తోంది. బుధవారం నాటికి గోదావారి మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించే అవకాశం ఉన్నట్లు అధికార యంత్రాంగం అంచ నా వేస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి ఆగస్టు నెలలో స్వాతంత్రదినోత్స సమయాన పలుమార్లు ఉగ్రరూపం దాల్చి ప్రవహించింది. ప్రధానంగా 1986 ఆగస్టు 15, 16 తేదీల్లో గోదావరి తుది ప్రమాద హెచ్చరిక దాటి 75.6 అడుగులకు చేరుకుంది. ఇదే ఇప్పటి వరకు అత్యధిక నీటమట్టంగా నమోదైంది.  

గోదావరి పెరుగుదల ఇలా (అడుగుల్లో)

సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు 36.8 

మంగళవారం ఉదయం ఆరు గంటలకు 37.9 

9 గంటలకు 39.1 

మధ్యాహ్నం 12 గంటలకు 40.0

రాత్రి 8 గంటలకు 45.2 

Updated Date - 2022-08-10T05:38:29+05:30 IST