లిస్టింగ్ కు... మూడు కంపెనీలు.. రూ. 2,387 కోట్ల సేకరణ లక్ష్యం

ABN , First Publish Date - 2022-05-17T21:24:35+05:30 IST

కొత్తగా మరో మూడు కంపెనీలు వచ్చే వారం IPO కు రానున్నాయి.

లిస్టింగ్ కు... మూడు కంపెనీలు..   రూ. 2,387 కోట్ల సేకరణ లక్ష్యం

ముంబై : కొత్తగా మరో మూడు కంపెనీలు వచ్చే వారం IPO కు రానున్నాయి. ఇవి... పారదీప్ ఫాస్ఫేట్స్(Paradeep Phosphates), ఎథోస్(Ethos), ఈ ముద్ర(eMudhra). IPO ద్వారా వచ్చే వారం ఈ కంపెనీలు ప్రైమరీ మార్కెట్‌ను తాకనున్నాయి. భారత్‌లో IPO ల హవా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. స్టాక్ మార్కెట్(Stock Marketing) లిస్టింగ్‌ కోసం పెద్ద కంపెనీలతో పాటు చిన్న కంపెనీలు కూడా వరుస కడుతున్నాయి. ఇప్పటికే LIC IPO ప్రక్రియ పూర్తయింది. కంపెనీ షేర్ల లిస్టింగ్(Company Shares Listing) రేపటితో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో మరో మూడు కంపెనీలు వచ్చే వారం IPO కు రానున్నాయి. ఈ జాబితాలో పారదీప్ ఫాస్ఫేట్స్(Paradeep Phosphates), ఎథోస్ (Ethos), ఈ-ముద్ర (eMudhra) కంపెనీలున్నాయి. BSE వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం... పారదీప్ ఫాస్ఫేట్స్ IPO కోసం సబ్‌స్క్రిప్షన్... ఈ రోజు(2022 మే 17) ఓపెన్ అయ్యింది. Ethos IPO మే 18 న, EMudhra IPO మే 20న ఓపెన్ కానున్నాయి. ఈ మూడు పబ్లిక్ ఇష్యూలు కలిసి దాదాపు రూ. 2,387 కోట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. వీటిలో పారదీప్ ఫాస్ఫేట్స్ IPO సైజు రూ. 1,501 కోట్లు, ఎథోస్ IPO సైజు రూ. 472 కోట్లు, ఈముద్ర IPO సైజు రూ. 412 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నాయి.  ఈ మూడు IPOలకు సంబంధించిన మరికొన్నని ముఖ్యమైన వివరాలిలా ఉన్నాయి. 


పారదీప్ ఫాస్ఫేట్స్ IPO... 

ఈ కంపెనీ ఒక యూరియాయేతర ఎరువుల తయారీ సంస్థ. రూ. 1501 కోట్ల విలువైన కంపెనీ పబ్లిక్ ఇష్యూ 2022 ఈ రోజు(మే 17 న) ఓపెన్ అయ్యింది. మే 19 వరకు బిడ్డింగ్ కొనసాగుతుంది. పారదీప్ ఫాస్ఫేట్స్ IPO ప్రైజ్ బ్యాండ్‌ రూ. 39 నుంచి రూ. 42 పర్ ఈక్విటీ షేర్‌గా ఉంది. బిడ్డర్ పబ్లిక్ ఇష్యూ కోసం లాట్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక లాట్ పారదీప్ ఫాస్ఫేట్స్ IPOలో 350 కంపెనీ షేర్లు ఉంటాయి. NSE, BSE రెండింటిలోనూ షేర్లు లిస్ట్ కానున్నాయి. IPO అలాట్‌మెంట్ మే 24 న, లిస్టింగ్ మే 27 న పూర్తి కానున్నాయి.


ఎథోస్ IPO... ఈ పబ్లిక్ ఇష్యూ రేపు(మే 18 న) సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్ అవుతుంది. ఇరవయ్యో తేదీ వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 472 కోట్ల విలువైన ఈ పబ్లిక్ ఇష్యూ ప్రైస్ బ్యాండ్‌ను ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 836 నుంచి రూ. 878 గా నిర్ణయించారు. బిడ్డర్లు పబ్లిక్ ఇష్యూ కోసం లాట్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో లాట్‌లో 17 షేర్లు ఉంటాయి. NSE, BSE రెండింటిలోనూ షేర్లు లిస్ట్ అవ్వడానికి పబ్లిక్ ఆఫర్‌ను ప్రతిపాదించారు. IPO అలాట్‌మెంట్ తేదీ మే 25 కాగా, లిస్టింగ్ తేదీని మే 30. 


e-Mudhra IPO.. ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూ మే 20 న ఓపెన్ అవుతుంది. మే 24 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం అప్లై చేసుకోవచ్చు. రూ. 412 కోట్ల విలువైన ఈ పబ్లిక్ ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 243 నుంచి రూ.256 గా ఉంది. బిడ్డర్లు పబ్లిక్ ఇష్యూ కోసం లాట్లలో దరఖాస్తు చేసుకోవాలి. ఒక లాట్‌లో 58 కంపెనీ షేర్లు ఉంటాయి. NSE, BSE రెండింటిలోనూ లిస్టింగ్ కోసం పబ్లిక్ ఆఫర్ జరగనుంది. IPO అలాట్‌మెంట్ మే 27 న, లిస్టింగ్ జూన్ 1 న పూర్తి కానున్నాయి. 

Updated Date - 2022-05-17T21:24:35+05:30 IST