పట్టణంలో రోడ్డు విస్తరణకు మరో ముందడుగు

ABN , First Publish Date - 2021-10-09T06:56:32+05:30 IST

భువనగిరిలో ప్రధాన రహదారిని 100 అడుగులకు విస్తరించడానికి మరో అడుగు పడింది. రహదారి విస్తరణకు అవసరమైన 27 వేల చదరపు గజాల స్థలం స్వాధీనం కోసం రహదారికి ఇరువైపులా ఉన్న 470 భవనాలు, ఖాళీ స్థలాల యజమానులకు శుక్రవారం నుంచి నోటీసులు జారీ చేస్తున్నారు

పట్టణంలో రోడ్డు విస్తరణకు మరో ముందడుగు
భువనగిరిలో దుకాణం యజమానురాలికి నోటీసు అందజేస్తున్న మునిసిపల్‌ సిబ్బంది

27వేల చదరపు గజాల స్వాధీనానికి 470 మందికి నోటీసుల జారీ

రూ.12.35 కోట్లతో మూడు దశల్లో పూర్తికానున్న పనులు

భువనగిరి టౌన్‌, అక్టోబరు 8:  భువనగిరిలో ప్రధాన రహదారిని 100 అడుగులకు విస్తరించడానికి మరో అడుగు పడింది. రహదారి విస్తరణకు అవసరమైన 27 వేల చదరపు గజాల  స్థలం స్వాధీనం కోసం రహదారికి ఇరువైపులా ఉన్న 470 భవనాలు, ఖాళీ స్థలాల యజమానులకు  శుక్రవారం నుంచి నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు స్వీకరించిన 24 గంటల్లో భవన నిర్మాణ అనుమతి పత్రాలు, ఖాళీ స్థలాల యాజమాన్య పత్రాలు మునిసిపల్‌ కార్యాలయంలో అందజేయాలని జారీ చేసిన నోటీసుల్లో మున్సి పల్‌ కమిషనర్‌ పేర్కొన్నారు. 

470మంది యజమానులకు నోటీసులు

పట్టణంలోని హైదరాబాద్‌– వరంగల్‌ రహదారి వెంట మారుతీ షోరూం నుంచి ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌ డీగీ కళాశాల వరకు ఇరువైపులా ఉన్న  470 మంది భవన, ఖాళీ స్థలాల యజమానులకు  నోటీసులు అందజేస్తున్నారు. 

ప్రస్తుతానికి రెండు కిలోమీటర్ల దూరమే విస్తరణ

భువనగిరిలోని ప్రధాన రహదారిని మారుతీ షోరూం నుంచి ఎస్‌ఎల్‌ఎన్‌ ఎస్‌ డిగ్రీ కళాశాల వరకు 5.5 కిలోమీటర్ల దూరాన్ని 100 అడుగులకు విస్త రించాలని అధికారులు మొదట నిర్ణయించారు. అయితే పలు కారణా లతో ప్రస్తుతం ఆర్‌అండ్‌బీ అతిఽథి గృహం నుంచి పాత  బస్‌స్టేషన్‌ వరకు కేవలం 2.150 కిలోమీటర్ల దూరం రోడ్డును 100 అడుగులుగా విస్తరించనున్నారు. ఈ 2.150 కిలోమీటర్ల రోడ్డును మూడు ప్యాకేజీలుగా విస్తరించడానికి  రూ.12.35 కోట్ల నిధులతో టెండర్ల పనులను అధికారులు పూర్తి చేశారు. భవనాలకు మార్కింగ్‌ కూడా పూర్తి చేశారు.

మొదటగా ప్రభుత్వ స్థలాలు, భవనాల  స్థలాలు స్వాధీనం

రహదారి విస్తరణ పనుల్లో భాగంగా తొలుతగా రహదారికి ఇరువైపులా ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలు, భవనాల స్థలాలను స్వాధీనం చేసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆస్తి నష్టం జరగనున్న రైల్వే, బీఎస్‌ ఎన్‌ఎల్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కోర్టు, ఆర్‌ అండ్‌బీ, ఇరిగేషన్‌, ఎల్‌ ఐసీ, పోలీస్‌ స్టేషన్‌ తదితర శాఖల అధికారులతో ఇప్పటికే చర్చించామని రోడ్డు విస్తరణ పనుల పర్యవేక్షణ అధికారులు తెలిపారు.  

నష్ట పరిహారానికి బదులుగా టీడీఆర్‌

భువనగిరిలోని ప్రధాన రహదారి మొదట నుంచి 100 అడుగులు ఉన్నం దున రహదారి విస్తరణ నిర్వాసితులకు ఎలాంటి నష్ట పరిహారం చెల్లించ బోమని మునిసిపల్‌ కమిషనర్‌ ఎం.పూర్ణచందర్‌ స్పష్టం చేశారు.  మునిసి పల్‌ సవరణ  చట్టం–2019  ప్రకారం నిర్వాసితులకు నష్టపరిహారం బదులు ట్రాన్స్‌పర్‌ ఆఫ్‌ డవలప్‌మెంట్‌ రైట్‌(టీడీఆర్‌) వర్తింపజేస్తామన్నారు. ఈ మేరకు సెట్‌ బ్యాక్‌ నిబంధనలు పాటిస్తూ మునిసిపల్‌ అనుమతులతో నిర్మిం చిన భవనాల నుంచి స్వాధీనం చేసుకున్న స్థలానికి నాలుగు రెట్ల  భవనాన్ని అక్కడే లేదా పట్టణంలో మరెక్కడైనా నిర్మించుకోవడానికి ఉచితంగా అను మతులు ఇస్తామన్నారు.  భవనాలకు నిర్మించుకోలేని యజమానులు టీడీ ఆర్‌ను  ఇతర భవనాల యజమానులకు  బదిలీ చేసుకోవచ్చన్నారు. మున్సి పాల్టీకి చెల్లించాల్సిన  బెటర్‌మెంట్‌ చార్జీలను సంబంధిత యజమానుల నుంచి వసూలు చేసుకునే  అధికారం నిర్వాసిత యజమానికి ఉందని ముని సిపల్‌ కమిషనర్‌ తెలిపారు. 

ఆస్తులు, యజమానుల వివరాలు ఇలా..

యజమానులు  రోడ్డుకు  రోడ్డకు

ఎడమవైపు కుడివైపు విస్ర్తీర్ణం గజాల్లో

ప్రభుత్వం స్థలాలు 9 3       7,206.01 

ప్రార్ధన స్థలాలు 2 7

భవనాలు 77 282

ఖాళీ స్థలాలు 47 43      19,394.21(పై మూడు) 

మొత్తం 135 335     26,600.22 



Updated Date - 2021-10-09T06:56:32+05:30 IST