Bheemla Nayak: సోల్ ఏంటో చెప్పే పాట ఎప్పుడంటే..

మలయాళ సూపర్ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కు తెలుగు రీమేక్‌గా రూపొందుతున్న మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న ఇందులో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా  నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి సోల్ ఏంటో చెప్పే పాటను డిసెంబర్ 1వ తేదీన ఉదయం గం.10:08ని.లకు రిలీజ్ చేయబోతున్నట్టు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటికే “భీమ్లా నాయక్” చిత్రం నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు పాటలు, టీజర్లు భారీ అంచనాలను ఏర్పరచాయి. ఇప్పుడు రాబోతున్న 'అడవి తల్లి మాట' అనే పాట మరింతగా అంచనాలను పెంచబోతోందని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిసున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, 2022, జనవరి 12న భారీ స్థాయిలో ప్రేక్షకులముందుకు రాబోతోంది.

Advertisement