Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 19 May 2022 13:40:21 IST

Shekar : ప్రభాస్ చేతుల మీదుగా ‘సత్యం శివం’ సింగిల్

twitter-iconwatsapp-iconfb-icon

యాంగ్రీమేన్ రాజశేఖర్ (Rajashekar) తాజా చిత్రం ‘శేఖర్’ (shekar). జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 20న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు మేకర్స్. అందులో భాగంగా ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలై మంచి స్పందన దక్కించుకుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘శేఖర్’ చిత్రం మలయాళ సూపర్ హిట్ ‘జోసెఫ్’ (Joseph) చిత్రానికిది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే.  ఇక ‘శేఖర్’ చిత్రం సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. ఇంకా విడుదలకు ఒక్కరోజు మాత్రమే ఉండడంతో ఈ సినిమా నుంచి ఓ లేటెస్ట్ సింగిల్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ లిరికల్ సాంగ్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేయడం విశేషం. 

‘సత్యం... శివం..’  (Satyam shivam..) అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య (Ramajogayya shastry) శాస్త్రి రచించగా.. విజయ్ యేసుదాస్ (Vijay Yesudas), ఉమానేహా (Uma Neha) ఆలపించారు. అనూప్ రూబెన్స్ (Anup Rubens) అందించిన చక్కటి మెలోడియస్ ట్యూన్‌లో ఆ పాట ప్రస్తుతం శ్రోతల్ని అలరిస్తోంది. తండ్రీ కూతుళ్ళ మధ్య సాగే  ఎమోషనల్ సాంగ్‌గా ఆకట్టుకుంటోంది. చిత్రంలో రాజశేఖర్ (Rajasekhar).. ఆయన కూతురుపై ఈ పాట వస్తుంది. నిజజీవితంలో తండ్రీ కూతుళ్ళైన రాజశేఖర్, శివానీ (Shivani).. ఈ సినిమాలో తండ్రీ కూతుళ్ళుగానే నటించడం విశేషం. ఈ ఇద్దరి మధ్యా వచ్చే సన్నివేశాలు ఎమోషనల్ గా కదిలిస్తాయి. 

‘శేఖర్’ (shekar) చిత్రానికి టాలీవుడ్‌లో మంచి పాజిటివ్ బజ్ వినిపిస్తోంది. ‘గరుడవేగ’ (Garudavega) మళ్ళీ హిట్ అందుకోలేకపోయిన రాజశేఖర్ (Rajasekhar)కు ఈ సినిమా ఖచ్చితంగా విజయాన్ని అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. పోలీసులకు సవాల్ గా మారిన యాక్సిడెంట్ కేసుల్ని ఛేదించడానికి రిటైర్డ్ పోలీసాఫీసర్ (Retired Police Officer) శేఖర్ (shekar) బరిలోకి దిగుతాడు. ఆ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్ళు, తెలుసుకున్న నిజాలు ఏంటనేది సినిమాకి కీలకం. ఈ నేపథ్యంలో శేఖర్ తీసుకొన్న నిర్ణయం ప్రేక్షకుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. అలాగే.. ఆ కేసు విషయంలో భార్యా, కూతుళ్ళ ప్రమేయం ఏంటన్నది మిగతా కథ. రిటైర్డ్ పోలీసాఫీసర్ పాత్రలో రాజశేఖర్ ఈ  మూవీతో  ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటారో చూడాలి. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement