కంచి పీఠానికి అనుబంధంగా మరో సర్వజ్ఞ పీఠం

ABN , First Publish Date - 2022-08-14T05:17:05+05:30 IST

జగద్గురువు, కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతీ స్వామివారి ఆశీస్సులు, విద్యా సరస్వతీ అమ్మవారి సంపూర్ణ అనుగ్రహంతో వర్గల్‌ క్షేత్ర సమూదాయం, శంభుగిరి పర్వత శ్రేణి వద్ద కంచి పీఠానికి అనుబంధంగా మరో సర్వజ్ఞ పీఠం వెలుస్తుండడం చారిత్రాత్మకమని సంతాన మల్లికార్జున క్షేత్ర వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక సంపన్నులు, బ్రహ్మశ్రీ డాక్టర్‌ చెప్పెల హరినాథశర్మ పేర్కొన్నారు.

కంచి పీఠానికి అనుబంధంగా మరో సర్వజ్ఞ పీఠం
వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలో శంకర మఠం నిర్మాణానికి పూజలు నిర్వహిస్తున్న దృశ్యం

విశ్వవ్యాప్త దైవశక్తికి ప్రతిరూపాలే పుణ్యక్షేత్రాలు

సంతాన మల్లికార్జున క్షేత్ర వ్యవస్థాపకులు చెప్పెల హరినాథశర్మ

వర్గల్‌, ఆగస్టు 13: జగద్గురువు, కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతీ స్వామివారి ఆశీస్సులు, విద్యా సరస్వతీ అమ్మవారి సంపూర్ణ అనుగ్రహంతో వర్గల్‌ క్షేత్ర సమూదాయం, శంభుగిరి పర్వత శ్రేణి వద్ద కంచి పీఠానికి అనుబంధంగా మరో సర్వజ్ఞ పీఠం వెలుస్తుండడం చారిత్రాత్మకమని సంతాన మల్లికార్జున క్షేత్ర వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక సంపన్నులు, బ్రహ్మశ్రీ డాక్టర్‌ చెప్పెల హరినాథశర్మ పేర్కొన్నారు. శనివారం వర్గల్‌ విద్యాధరి క్షేత్రం వద్ద ఆలయ వ్యవస్థాపకులు చంద్రశేఖరశర్మ సిద్ధాంతి నేతృత్వంలో వేదపండితులు కంచి మఠం నిర్మాణానికి శిలాన్యాసం వేసి మాట్లాడారు. విశ్వవ్యాప్తమైన దైవ శక్తికి ఆలయాలు, పుణ్యక్షేత్రాలు ప్రతిరూపంగా నిలుస్తున్నట్లు చెప్పారు. పురాతన కాలంలోనే సర్వజ్ఞ పీఠానికి అధిపతి అయిన ఆదిశంకరుడు నాలుగు దిశలా నాలుగు పీఠాలు ప్రతిష్టింపజేసినట్లు తెలిపారు. కంచి పీఠానికి ఆదిశంకరుడు ఆధిపతిగా ఉంటూ న్యాయం, ధర్మం బోధించినట్లు చెప్పారు. కంచి కామాక్షి ప్రతిరూపంగా వర్గల్‌ విద్యా సరస్వతీ అమ్మవారు మోక్ష దేవతగా ప్రసిద్ధికెక్కినట్లు తెలిపారు. కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతీ చాతుర్మాస్య దీక్షలో భాగంగా వర్గల్‌ క్షేత్రం కేంద్రంగా ధర్మ బోధన చేసేందుకు నిర్ణయించడం శుభ పరిణామమన్నారు. అనంతరం శంభుగిరి వద్ద వేదపండితులు, కమిటీ సభ్యులు అర్చక వసతి సముదాయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంటేరి యాదవరెడ్డి, గజ్వేల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి, ఎంపీపీ లతారమేష్‌ గౌడ్‌, జడ్పీటీసీ బాలుయాదవ్‌, సర్పంచ్‌ గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

గొప్ప ఆధ్మాత్మిక కేంద్రంగా వర్గల్‌ విద్యాధరి: వంటేరు ప్రతాప్‌రెడ్డి

వర్గల్‌ విద్యాధరి క్షేత్రం గొప్ప ఆఽధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందని ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి అన్నారు. వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలో శంకర మఠం నిర్మాణం కోసం చేసిన భూమి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతిని పరితపించేలా ఎత్తైన కొండలపై విద్యా సరస్వతీ అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారమైందని ప్రతా్‌పరెడ్డి చెప్పారు. 

Updated Date - 2022-08-14T05:17:05+05:30 IST