మరో 408 కోట్ల పెట్టుబడులు

ABN , First Publish Date - 2020-05-29T08:14:28+05:30 IST

రాష్ట్రంలో అదనంగా రూ.408 కోట్ల(5.4 కోట్ల డాలర్లు) పెట్టుబడి పెడతామని కియ సీఈవో, ఎండీ షిమ్‌

మరో 408 కోట్ల పెట్టుబడులు

రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన

పెట్టుబడులకు ఏపీ అనుకూలం: కియ సీఈవో షిమ్‌


అమరావతి, మే 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అదనంగా రూ.408 కోట్ల(5.4 కోట్ల డాలర్లు) పెట్టుబడి పెడతామని కియ సీఈవో, ఎండీ షిమ్‌ ప్రకటించారు. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో ‘మన పాలన..మీ సూచన’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు. ఈ నెల మొదటి వారంలోనే కియ తన ఉత్పత్తులను పునఃప్రారంభించిందన్నారు. కియ మోటార్స్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ప్రొగ్రామ్‌ కింద 2,416 మందికి శిక్షణ ఇచ్చామని, 1,585 మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని చెప్పారు. కొవిడ్‌-19 ప్రభావం ఉన్నప్పటికీ తాము త్వరలోనే రూ.408 కోట్ల పెట్టుబడితో కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేయబోతున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో మానవ వనరుల లభ్యత, జవాబుదారీతనం అధికంగా ఉన్నాయని, విశాలమైన భూమి, అనుకూలమైన రవాణా వ్యవస్థలతో ఏపీ పెట్టుబడులకు సానుకూలంగా ఉందన్నారు. 

Updated Date - 2020-05-29T08:14:28+05:30 IST