Ts news: రౌడీషీటర్‌పై మరో రౌడీ షీటర్ హత్యాయత్నం

ABN , First Publish Date - 2022-08-19T17:09:15+05:30 IST

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రౌడీ షీటర్‌పై మరో రౌడీ షీటర్ హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Ts news: రౌడీషీటర్‌పై మరో రౌడీ షీటర్ హత్యాయత్నం

రంగారెడ్డి: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రౌడీ షీటర్‌పై మరో రౌడీ షీటర్ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆరంఘర్ చౌరస్తాలో పాన్ షాప్ తెరిచేందుకు వచ్చిన రౌడీ షీటర్ ఖాజా పాషాపై  మరో రౌడీ షీటర్ చిన్న అలియాస్ మోసిన్ కత్తితో దాడి చేశాడు. అక్కడ నుంచి తప్పించుకున్న ఖాజా పాషా పోలీస్‌స్టేషన్‌కు పరుగులు తీశాడు. పాత గొడవలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఇరువురు హసన్‌నగర్‌కు చెందిన వారుగా తెలుస్తోంది. గతంలో రౌడీలు జైలు శిక్షను కూడా అనుభవించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Updated Date - 2022-08-19T17:09:15+05:30 IST