ఏయూలో మరో క్రీడా మైదానం

ABN , First Publish Date - 2022-05-26T06:42:06+05:30 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మరో క్రీడా మైదానం, ఇంటిగ్రేటెడ్‌ ఇండోర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మించనున్నారు. ఇందుకోసం నార్త్‌ క్యాంపస్‌ పరిధిలో 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిని వినియోగించుకోనున్నారు.

ఏయూలో మరో క్రీడా మైదానం
క్రీడా మైదానానికి సిద్ధం చేస్తున్న స్థలం

నార్త్‌ క్యాంపస్‌ పరిధిలోని 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం

 15 ఎకరాల్లో ఓపెన్‌ మైదానం, ఐదు ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్‌ ఇండోర్‌ స్టేడియం

ప్రారంభమైన మొక్కల  తొలగింపు   

 సీఎంఆర్‌ నుంచి మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ వరకు భారీగా ప్రహరీ నిర్మాణం  


(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి) 

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మరో క్రీడా మైదానం, ఇంటిగ్రేటెడ్‌ ఇండోర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మించనున్నారు. ఇందుకోసం నార్త్‌ క్యాంపస్‌ పరిధిలో 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిని వినియోగించుకోనున్నారు. ఇక్కడ సుమారు 71 ఎకరాలలో చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో.. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. గంజాయి, ఇతర మత్తుపదార్థాలు తీసుకునే వారికి నిలయంగా మారడంతో పాటు ఆక్రమణలకు గురవుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో స్థలాన్ని పూర్తిగా చదును చేయడంతోపాటు విద్యార్థులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దేలా ప్రణాళిక రూపొందించారు. అందుకు అనుగుణంగానే 15 ఎకరాల్లో ఓపెన్‌ క్రీడా మైదాన్ని నిర్మించాలని నిర్ణయించారు. మరో ఐదు ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్‌ ఇండోర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను సుమారు రూ.5 కోట్లు వ్యయంతో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీనివల్ల యూనివర్సిటీవిద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తు న్నారు. విశ్వవిద్యాలయానికి మద్దెలపాలెం వైపు రెండు మైదానాలున్నాయి. వీటిలో ఇంజనీరింగ్‌ కళాశాల గ్రౌం డ్‌ ఒకటి, మరొకటి స్మాల్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌. ఈ గ్రౌండ్‌ను సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఇండియా  కోసం అరఎకరం, బిల్డింగ్‌ నిర్మాణానికి అరఎకరం కేటాయిం చారు. రానున్న రోజుల్లో ఈ మైదానం పూర్తిగా అందు బాటులో లేకుండాపోతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని మరో మైదానాన్ని తీసుకువచ్చే చర్యలను వేగవంతం చేశారు. ఇప్పటికే పనులను ప్రారంభించారు. డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. 


పటిష్ఠంగా ప్రహరీ నిర్మాణం

నార్త్‌ క్యాంపస్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో భూమి ఆక్రమణలకు గురవడంతోపాటు దొంగతనాలు చేసిన వాహనాలు పార్కింగ్‌కు అడ్డాగా మారుతోంది. ఈ నేప థ్యంలో భూములను పరిరక్షించుకునేందుకు అధికా రులు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం మద్దెలపా లెం నుంచి పిఠాపురం కాలనీ మీదుగా మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌ వరకు ప్రహరీని నిర్మించాలని నిర్ణయిం చారు. దీంతోపాటు కంచె వేయనున్నారు. అలాగే, ట్రైబల్‌ ఫుడ్‌కోర్టును ఒకటి నిర్మించాలన్న ప్రతిపాద నను తెరపైకి తెచ్చారు. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఆర్గానిక్‌ ఆహార ఉత్పత్తులను విక్రయించేందుకు అను గుణంగా ఫుడ్‌ కోర్టు నిర్మాణం చేయాలని భావిస్తు న్నారు. ఆర్గానిక్‌ ఆహార ఉత్పత్తులతోపాటు గిరిజన ప్రాంతాల్లో లభించే పలు వస్తువులు విక్రయానికి అనుగుణంగా ఫుడ్‌కోర్టు నిర్మాణం ఉంటుందని రిజిస్ర్టార్‌ కృష్ణమోహన్‌ తెలిపారు. ఇప్పటికే ఈ మేర కు ప్రతిపాధనలు సిద్ధం చేయమని అధికారులను ఆదేశించామని, ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో ఆమోదంతో త్వరలోనే ఈ పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన వివరించారు. 

Updated Date - 2022-05-26T06:42:06+05:30 IST