రాజస్థాన్‌లో మరో నిర్భయ ఘటన

ABN , First Publish Date - 2022-01-13T16:39:31+05:30 IST

రాజస్థాన్ రాష్ట్రంలో మరో నిర్భయ ఘటన జరిగింది....

రాజస్థాన్‌లో మరో నిర్భయ ఘటన

బాలికపై సామూహిక అత్యాచారం జరిపి, ప్రైవేటు భాగంలో పదునైన వస్తువులు చొప్పించారు...

జైపూర్ : రాజస్థాన్ రాష్ట్రంలో మరో నిర్భయ ఘటన జరిగింది. అల్వార్ జిల్లాలో పదహారేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేయడంతోపాటు ఆమె ప్రైవేటు భాగంలో పదునైన వస్తువులను చొప్పించిన దారుణ ఘటన జరిగింది. అల్వారా పట్టణంలోని తిజారా ఫ్లైఓవర్ కింద పదహారేళ్ల బాలిక రక్తపు మడుగులో పడి ఉండగా పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను జైపూర్ నగరంలోని జేకే లోన్ ఆసుపత్రికి తరలించారు.బాధిత బాలికకు రక్త స్రావం ఆగకపోవడంతో వైద్యులు రెండున్నర గంటలపాటు ఆపరేషన్ చేశారు.


 బాలిక ప్రైవేటు పార్టులో పదునైన వస్తువులను చొప్పించడంతో ఆమె అంతర్గత అవయవాలకు తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు చెప్పారు. బాలికను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచి చికిత్స చేస్తున్నామని డాక్టర్ అరవింద్ శుక్లా చెప్పారు. మరోవైపు ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.25 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేసిన 300కు పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించామని, అయితే ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు చెప్పారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని రాజస్థాన్ మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి మమతా భూపేష్ హామీ ఇచ్చారు.


మంత్రి మమతా భూపేష్ బాలిక కుటుంబానికి రూ.6 లక్షల పరిహారం ప్రకటించారు. రూ.6 లక్షలలో రూ.5 లక్షలు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, రూ. లక్షను మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అందించింది.అల్వార్‌లోని బాధిత కుటుంబ సభ్యులకు సామాజిక న్యాయ శాఖ మంత్రి టికారమ్ జూలీ రూ. 3.5 లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించారు. బాధితురాలి తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తుండగా ఆమెకు సోదరుడు, సోదరి ఉన్నారు.


Updated Date - 2022-01-13T16:39:31+05:30 IST