Abn logo
Aug 3 2020 @ 13:43PM

నాని, మారుతి కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం..?

నేచుర‌ల్ స్టార్ నానికి హీరోగా క్రేజ్ తేవ‌డ‌మే కాదు.. మంచి మార్కెట్‌ను క్రియేట్ చేసిన చిత్రాల్లో ‘భ‌లేభ‌లేమ‌గాడివోయ్‌’ సినిమా ముందు వ‌రుస‌లో ఉంటుంది. ఈ సినిమాలో మెమొరీ లాస్ అనే కాన్సెప్ట్‌తో బాధ‌ప‌డే యువ‌కుడు ప్రేమ‌లో ప‌డితే ఎలా ఉంటుంది? అనే పాయింట్‌ను హ్యుమ‌ర‌స్‌గా డైరెక్ట‌ర్ మారుతి తెర‌కెక్కించిన తీరుకి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఇప్పుడు ఇదే కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రూపొంద‌నుందని స‌మాచారం. ‘ప్ర‌తిరోజూ పండుగే’ సినిమాతో హిట్ సాధించిన మారుతి ఓ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశార‌ట‌. ఈ క‌థ‌ను రీసెంట్‌గా నానికి వినిపించార‌ట‌. నానికి క‌థ న‌చ్చింది. ఆయ‌న కూడా ఓకే అన్నారట‌. అయితే నాని ‘ట‌క్ జ‌గ‌దీష్’ త‌ర్వాత ‘శ్యామ్ సింగ‌రాయ్‌’ సినిమా చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాల త‌ర్వాతే మారుతితో సినిమా ఉంటుంద‌నే వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement