Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 22 May 2022 11:45:33 IST

Vijay - Lokesh kanagaraj : కాంబో రిపీట్ కానుందా?

twitter-iconwatsapp-iconfb-icon

కొన్ని కాంబినేషన్స్‌కు ఎక్కడలేని క్రేజ్ ఉంటుంది. అది రిపీట్ అయితే .. రెట్టింపు అంచనాలు నెలకొంటాయి. కోలీవుడ్‌లో అలాంటి ఓ సూపర్ కాంబోకి సన్నాహాలు జరుగుతున్నాయనే వార్త.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ కాంబో మరెవరిదో కాదు. Vijay - Lokesh kanagaraj. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘మాస్టర్’ (Master) చిత్రం కోలీవుడ్‌‌తో పాటు టాలీవుడ్ లోనూ మంచి సక్సెస్ నమోదు చేసుకుంది. ముఖ్యంగా కోలీవుడ్‌లో అయితే.. దళపతి విజయ్ గత రికార్డుల్ని తిరగరాసింది. జువైనల్ హోమ్‌కు మాస్టర్‌గా వెళ్ళిన ‌కథానాయకుడు అక్కడ జరిగే కొన్ని అరాచకాల్ని ఎలా అరికట్టాడు? నేరాల కోరల్లో చిక్కుకున్న అక్కడ బాల ఖైదీల్ని ఆ చర నుంచి ఎలా తప్పించాడు అన్నదే ఈ సినిమా కథాంశం. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) విలనిజం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. నిజానికి ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని అప్పట్లో హింటిచ్చాడు దర్శకుడు. 


మరి లోకేష్ కనగరాజ్ (Lokesh kanagaraj)..  విజయ్ (Vijay) తో తీయబోయే రెండో సినిమా ‘మాస్టర్’ (Master) కు సీక్వెలా లేక మరో తాజా కథ అనే విషయంలో క్లారిటీ లేదు.ఈ సినిమా దాదాపు ఖాయమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం లోకేష్ కమల్ హీరోగా తెరకెక్కించిన ‘విక్రమ్’ (Vikram) చిత్రం విడుదలకు రెడీ అయింది. దీని తర్వాత లోకేష్ తీయబోయేది విజయ్‌తోనే అని సమాచారం. ఇటీవల ‘బీస్ట్’ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించిన విజయ్.. తదుపరిగా వంశీ పైడిపల్లి (Vamshy Paidipalli) దర్శకత్వంలో తెలుగు, తమిళ బైలింగ్విల్ మూవీకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాతో పాటు మరికొన్ని కమిట్‌మెంట్స్ ఉన్నాయి. వాటితో పాటు లోకేష్ కనగరాజ్ చిత్రాన్ని కూడా సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నాడట విజయ్. మరి వీరి కలయికలోని సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International