ఆర్టీసీ బోర్డులోకి మరో ‘మనోడు’

ABN , First Publish Date - 2022-10-05T08:33:38+05:30 IST

ఆర్టీసీ బోర్డులోకి మరో ‘మనోడు’

ఆర్టీసీ బోర్డులోకి మరో ‘మనోడు’

బోర్డు డైరెక్టర్‌గా రాజా రెడ్డి నియామకం

అమరావతి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్‌ ఏపీఎ్‌సఆర్టీసీ పాలక మండలిలోకి మరో ‘మనోడి’ని తీసుకొచ్చారు. వైఎ్‌సఆర్‌ మజ్దూర్‌ యూనియన్‌ మాజీ అధ్యక్షుడు రాజారెడ్డి కోసం బోర్డులోని ఒక అధికారి పని ని విభజించి మరీ ఆయన్ను బోర్డు డైరెక్టర్‌గా నియమించారు. కడప జిల్లాకు చెందిన మల్లికార్జున రెడ్డి(సీఎం చిన్నాన్న) చైర్మన్‌ కాగా.. చిత్తూరు జిల్లాకు చెందిన విజయానందరెడ్డి వైఎస్‌ చైర్మన్‌గా గతేడాది ఆగస్టు మొదటి వారం లో నియమితులయ్యారు. నెల్లూరు జోన్‌ డైరెక్టర్‌గా సింగరాయకొండకు చెందిన సుప్రజా రెడ్డిని నియమించిన వైసీపీ ప్రభుత్వం తాజాగా అన్నమ య్య జిల్లా పీలేరుకు చెందిన రాజారెడ్డిని బోర్డులోకి తీసుకొచ్చింది. బోర్డు సభ్యుల్లో సభ్య కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తించే ఈడీ(ఏ) బాధ్యతల్లో కొన్నింటిని తగ్గించి బోర్డు డైరెక్టర్‌గా నియమితులైన రాజారెడ్డికి అప్పగించింది. రాజారెడ్డి చేయనున్న పనిని రూపాయి అదనంగా తీసుకోకుండా ఈడీ(ఏ) ఇప్పటికే చేస్తున్నారు. కానీ తన తండ్రి పేరుతో యూనియన్‌ స్థాపించిన సీమ వ్యక్తి కోసం పదవి సృష్టించిన సీఎం ఆర్టీసీపై భారం మోపడం విశేషం.


Updated Date - 2022-10-05T08:33:38+05:30 IST