Abn logo
Jan 21 2021 @ 09:08AM

మరో కొరియన్ సినిమాకు రంగం సిద్ధం!

కొరియన్ సినిమా `మిస్ గ్రానీ`ని తెలుగులోకి `ఓ బేబీ` పేరుతో రీమేక్ చేసి విజయం అందుకుంది సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ. త్వరలో మరో కొరియన్ సినిమాను కూడా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా రీమేక్ చేయబోతోందట. కొరియన్ భాషలో సూపర్ హిట్‌గా నిలిచిన `లక్ కీ`ని తెలుగులోకి రీమేక్ చేయబోతున్నట్టు `సురేష్ ప్రొడక్షన్స్` సంస్థ అధికారికంగా ప్రకటించింది. 


జపనీస్‌లో తెరకెక్కిన `కీ ఆఫ్ లైఫ్`కు ఇది కొరియన్ రీమేక్. ఈ సినిమాను గురు ఫిల్మ్స్, ఎస్ కే గ్లోబాలెంట్‌తో కలిసి సురేష్ బాబు సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా రీమేక్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రారంభం అయ్యింది. ఓ ప్రముఖ దర్శకుడు, ప్రముఖ నటుడు ఈ సినిమా కోసం పనిచేయబోతున్నట్టు సురేష్ సంస్థ ప్రకటించింది. 


Advertisement
Advertisement
Advertisement