Russia-Ukraine war:కైవ్‌లో మరో భారతీయ విద్యార్థిపై కాల్పులు...ఆసుపత్రికి తరలింపు

ABN , First Publish Date - 2022-03-04T13:37:44+05:30 IST

ఉక్రెయిన్ దేశంలోని కైవ్ నగరంలో రష్యా సైనికులు జరిపిన కాల్పుల్లో మరో భారతీయ విద్యార్థి గాయపడ్డారు. ...

Russia-Ukraine war:కైవ్‌లో మరో భారతీయ విద్యార్థిపై కాల్పులు...ఆసుపత్రికి తరలింపు

కైవ్ (ఉక్రెయిన్): ఉక్రెయిన్ దేశంలోని కైవ్ నగరంలో రష్యా సైనికులు జరిపిన కాల్పుల్లో మరో భారతీయ విద్యార్థి గాయపడ్డారు. కైవ్ నగరంలో బుల్లెట్ గాయమైన భారతీయ విద్యార్థిని ఆసుపత్రికి తరలించామని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి జనరల్ వీకే సింగ్ పోలాండ్ విమానాశ్రయంలో చెప్పారు. గతంలో రష్యా సైనికులు జరిపిన కాల్పుల్లో ఓ భారతీయ విద్యార్థి మరణించగా, మరో విద్యార్థి గాయపడ్డారు. కైవ్ నగరంలో ఉంటున్న భారతీయ విద్యార్థి కాల్పుల్లో గాయపడినట్లు కేంద్ర మంత్రి సింగ్ చెప్పారు.ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధం నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం భారతీయులను అక్కడి నుంచి తరలిస్తోంది.


భారత విద్యార్థులు ఉక్రెయిన్ దేశం నుంచి పారిపోయి పోలాండ్ దేశ సరిహద్దులకు చేరుకుంటున్నారు.నలుగురు కేంద్రమంత్రులు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య ఎం సింధియా, కిరణ్ రిజిజు, జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ లు ఉక్రెయిన్‌కు ఆనుకుని ఉన్న దేశాల్లో భారతీయుల తరలింపు ప్రయత్నాలను పర్యవేక్షిస్తున్నారు.


Updated Date - 2022-03-04T13:37:44+05:30 IST