Abn logo
May 8 2020 @ 15:04PM

నితిన్ సినిమాలో మ‌రో హీరో..!

ప్ర‌స్తుతం వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ‘రంగ్ దే’ చిత్రంతో యువ క‌థానాయ‌కుడు నితిన్ బిజీగా ఉన్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌. తుది ద‌శ‌కు చేరుకున్న ఈ సినిమా షూటింగ్ క‌రోనా ఎఫ‌క్ట్ వ‌ల్ల ఆగింది. దీని త‌ర్వాత నితిన్ మ‌రో మూడు సినిమాల‌ను లైన్‌లో పెట్టాడు. అందులో ఒక‌టి కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం ‘ప‌వ‌ర్‌పేట‌’. రెండు భాగాలుగా రూపొందనున్న ఈ చిత్రంలోనూ కీర్తిసురేశ్‌నే హీరోయిన్‌గా తీసుకున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. కాగా.. సినిమాను మ‌లుపు తిప్పే కీల‌క‌మైన పాత్ర‌లో బ్ల‌ఫ్‌మాస్ట‌ర్ ఫేమ్ స‌త్య‌దేవ్ న‌టిస్తున్నాడ‌ట‌. నితిన్ పాత్ర‌కు స‌మాన‌మైన ప్రాధాన్య‌త ఉండే పాత్ర ఇద‌ని టాక్‌. 

Advertisement
Advertisement
Advertisement