ఆదోనిలో మరో ఐదు కేసులు

ABN , First Publish Date - 2020-05-30T09:58:42+05:30 IST

ఆదోనిలో కరోనా ఉధృతి ఆగడం లేదు. శుక్రవారం మరో ఐదు కేసులు నమోదయ్యాయి

ఆదోనిలో మరో ఐదు కేసులు

తుగ్గలిలో ఒకటి, ఆలూరులో ఒకటి

695కి చేరిన బాధితుల సంఖ్య


కర్నూలు(హాస్పిటల్‌), మే 29: ఆదోనిలో కరోనా ఉధృతి ఆగడం లేదు. శుక్రవారం మరో ఐదు కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఏడుగురికి వైరస్‌ నిర్ధారణ అయింది. ఆదోనిలోని పరీద్‌సాహెబ్‌ మొహల్లలో ఒకటి, కార్వన్‌పేటలో ఒకటి, మున్సిపల్‌ ఆఫీస్‌ వద్ద ఒకటి, బసరకోడులో ఇద్దరికి కరోనా సోకింది. తుగ్గలి మండలం రాతన కొత్తూరు గ్రామంలో చెన్నై నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా నిర్ధారణ కాగా, ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామలో ఓ వ్యక్తికి ఇతరుల నుంచి కరోనా వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. కొత్తగా వచ్చిన ఏడు కేసులతో జిల్లాలో బాధితులు 695కు చేరారు. ఇక ఆదోని ప్రాంతంలో తాజా కేసులను కలుపుకుని బాధితుల సంఖ్య 45కు చేరింది.


600 దాటిన డిశ్చార్జిలు

జిల్లాలో కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 600 దాటింది. శుక్రవారం నలుగురు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి స్టేట్‌ కొవిడ్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. డిశ్చార్జి అయిన 100 బాధితుడికి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.నరేంద్రనాథ్‌రెడ్డి సమ్మరినీ అందజేశారు. కర్నూలు జీజీహెచ్‌లో కరోనా విజేతల సంఖ్య 101కి దాటడంపై కలెక్టర్‌ వీరపాండ్యన్‌, ప్రిన్సిపాల్‌ డా.పి.చంద్రశేఖర్‌ అభినందించారు. డిశ్చార్జి అయిన వారికి రూ.2వేల ఆర్థిక సాయాన్ని సూపరింటెండెంట్‌ అందించారు. కార్యక్రమంలో పల్మనాలజి హెచ్‌వోడీ డా.శైలజా, కోవిడ్‌ నోడల్‌ ఆఫీసర్‌ డా.సునీల్‌కుమార్‌, ఫల్మనాలజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.శ్రీధర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-30T09:58:42+05:30 IST