అబ్దుల్ హక్ ఉర్దూ వర్సిటీలో మరో నకిలీ ఉద్యోగి గుర్తింపు

ABN , First Publish Date - 2021-11-09T01:52:24+05:30 IST

జిల్లాలోని డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ వర్సిటీలో మరో నకిలీ

అబ్దుల్ హక్ ఉర్దూ వర్సిటీలో మరో నకిలీ ఉద్యోగి గుర్తింపు

కర్నూలు: జిల్లాలోని  డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ వర్సిటీలో మరో నకిలీ ఉద్యోగిని అధికారులు గుర్తించారు. వర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది విద్యార్హత పత్రాలపై రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బాయినేని శ్రీనివాసులు విచారణ జరిపారు. టీచింగ్ అసిస్టెంట్ షేక్ రుబీనాకు చెందిన ఏపీ-టీఎస్ సెట్ సర్టిఫికెట్ నకిలీదిగా గుర్తించారు. షేక్ రుబీనాను ఉద్యోగం నుంచి తొలగిస్తూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బాయినేని శ్రీనివాసులు ఉత్తర్వులు జారీ చేసారు. అలాగే ఆమె ఉద్యోగంలో చేరి తీసుకున్న 19 నెలల జీతం మొత్తం 4,57,215 రూపాయలను రిజిస్ట్రార్ అకౌంట్‌లో జమ చేయాలని రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేసారు. 

Updated Date - 2021-11-09T01:52:24+05:30 IST