Abn logo
Oct 1 2020 @ 00:56AM

ముకేశ్‌కు మరో చెక్కు

Kaakateeya

  • రిలయన్స్‌ రిటైల్‌లో జనరల్‌ అట్లాంటిక్‌ పెట్టుబడులు 
  • రూ.3,675 కోట్లకు 0.84 శాతం వాటా కొనుగోలు 


న్యూఢిల్లీ: ముకేశ్‌ అంబానీ మరో భారీ చెక్కు ను అందుకోనున్నారు. అంతర్జాతీయ పీఈ దిగ్గ జం జనరల్‌ అట్లాంటిక్‌.. రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌(ఆర్‌ఆర్‌వీఎల్‌)లో 0.84ు వాటా ను రూ.3,675 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు రిలయ న్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) బుధవారం వెల్లడించింది. రిలయన్స్‌ రిటైల్‌లోకి వచ్చిన మూ డో పీఈ పెట్టుబడి ఇది. తొలుత అమెరికన్‌ పీఈ సంస్థ సిల్వర్‌ లేక్‌ పార్ట్‌నర్స్‌ రూ.7,500 కోట్లకు 1.75 శాతం వాటా కొనుగోలు చేసింది. మరో అం తర్జాతీయ పీఈ సంస్థ కేకేఆర్‌ అండ్‌ కో 1.28ు వాటా కోసం రూ. 5,500 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. తాజా ఒప్పం దం సందర్భంగా రిలయన్స్‌ రిటైల్‌ మార్కెట్‌ విలువను రూ.4.285 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. జనరల్‌ అట్లాంటిక్‌కు రిలయన్స్‌ సంస్థల్లో ఇది రెండో పెట్టుబడి. ఆర్‌ఐఎల్‌ కు చెందిన డిజిటల్‌ సేవల కంపెనీ జియో ప్లాట్‌ఫామ్స్‌లోనూ రూ. 6,598.38 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది. మొత్తం 13 మంది ఇన్వెస్టర్లకు 30ు పైగా వాటా విక్రయం ద్వారా జియో ప్లాట్‌ఫామ్‌ రూ.1.52 లక్షల కోట్లు సేకరించింది. 


సిల్వర్‌ లేక్‌ మరో రూ.1,875 కోట్ల పెట్టుబడి 

సిల్వర్‌ లేక్‌ సహ ఇన్వెస్టర్లు కూడా రూ.1,875 కోట్లు పెట్టుబడిగా పెడుతున్నట్లు రిలయన్స్‌ రిటైల్‌ ప్రకటించింది. దాంతో సిల్వర్‌ లేక్‌  మొత్తం పెట్టుబడులు రూ.9,375 కోట్లకు చేరుకున్నాయి. 


క్యూలో టీపీజీ, ముబదాల

రిలయన్స్‌ రిటైల్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మరో 3-4 అంతర్జాతీయ సంస్థలు క్యూలో ఉన్నట్లు తెలిసింది. అందులో అబుదాబి ప్రభు త్వ రంగ ఫండ్‌ ‘ముబదాల ఇన్వె్‌స్టమెంట్‌ కంపెనీ’, అంతర్జాతీయ పీఈ సంస్థ టీపీజీ క్యాపిటల్‌, అబుదాబి ఇన్వె్‌స్టమెంట్‌ అథారిటీ (ఏడీఐఏ), ఎల్‌ కాటర్టన్‌ ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం ఈ సంస్థలు రిలయన్స్‌తో చర్చలు జరుపుతున్నాయని, పెట్టుబడులపై త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముబదాల 100 కోట్ల డాలర్లు (దాదాపు రూ.7,500 కోట్లు), టీపీజీ 70-80 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.

Advertisement
Advertisement
Advertisement