case registered against HCA: హెచ్‌సీఏపై మరో కేసు నమోదు

ABN , First Publish Date - 2022-09-28T14:39:16+05:30 IST

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై మరో కేసు నమోదు అయ్యింది. మ్యాచ్ టికెట్ల విక్రయం, తొక్కిసలాటలో భాగంగా హెచ్‌సీఏపై ఇప్పటికే మూడు కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.

case registered against HCA: హెచ్‌సీఏపై మరో కేసు నమోదు

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ (Hyderabad Cricket Association)పై మరో కేసు నమోదు అయ్యింది. మ్యాచ్ టికెట్ల విక్రయం, తొక్కిసలాటలో భాగంగా హెచ్‌సీఏపై ఇప్పటికే మూడు కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. తాజాగా హెచ్‌సీఏ (HCA)పై బేగంపేట పోలీసులు మరో కేసును నమోదు చేశారు. మ్యాచ్ టికెట్‌పై ఉన్న సమయం, ప్రారంభమైన మ్యాచ్ మధ్య వ్యత్యాసం ఉందంటూ ఫిర్యాదు ఓ యువకుడు ఫిర్యాదు చేశాడు. టికెట్‌పై మ్యాచ్ ప్రారంభ సమయం 7:30 ఉండగా 7 గంటలకే మ్యాచ్ ప్రారంభమైంది. దీంతో టికెట్‌పై హెచ్‌సీఏ తప్పుడు టైమింగ్ ఇచ్చిందంటూ బేగంపేట్ పోలీస్‌స్టేషన్‌లో యువకుడు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేశారు. టికెట్ల సమయంలో జరిగిన తొక్కిసలాటపై ఇప్పటికే పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. తాజా ఫిర్యాదుతో హెచ్‌సీఏపై మొత్తం నాలుగు కేసులు నమోదు అయ్యాయి. 

Updated Date - 2022-09-28T14:39:16+05:30 IST