Delhi-NCRలలో భారీవర్షాలు...ఆలస్యంగా విమానాల రాకపోకలు

ABN , First Publish Date - 2022-05-24T13:06:08+05:30 IST

ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో సోమవారం రాత్రి కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి....

Delhi-NCRలలో భారీవర్షాలు...ఆలస్యంగా విమానాల రాకపోకలు

న్యూఢిల్లీ: ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో సోమవారం రాత్రి కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి.ఉరుములు,మెరుపులతో కూడిన భారీవర్షం కురుస్తుండటంతో ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీవర్షాల వల్ల పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి.గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.పంజాబ్, హర్యానా, ఉత్తర రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లలో రాగల పది గంటల్లో వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. భారీవర్షాల వల్ల వరదనీరు రోడ్లపై ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.


 ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్‌, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లోని చాలా ప్రాంతాలలో వర్షాలు కురిశాయి.


Updated Date - 2022-05-24T13:06:08+05:30 IST