Oct 28 2021 @ 15:48PM

‘రొమాంటిక్’ చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణ?

పూరీ ఆకాశ్ హీరోగా నటించిన ‘రొమాంటిక్’ చిత్రం ఈ శుక్రవారం థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కానుంది. రీసెంట్ గా విడుదలైన రెండు ట్రైలర్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించగా.. పూరీ శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. తనయుడి సినిమా కావడంతో అన్ని కోణాల్లోనూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు పూరీ.  విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూ, ప్రభాస్, ఆకాశ్, కేతికా శర్మ  చేసిన ఇంటర్వ్యూ బాగా పేలడంతో ఈ సినిమాకి ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో రొమాంటిక్ చిత్రానికి అదిరిపోయే మరో అంశాన్ని ప్రత్యేక ఆకర్షణగా జోడిస్తున్నట్టు సమాచారం. ‘రొమాంటిక్’ చిత్రంలో ఓ పాటలో ఆకాశ్ తో కలిసి ఎనర్జిటిక్ స్టార్ రామ్ మాస్ స్టెప్పులేశారట. రామ్ కు పూరీ ‘ఇస్మార్ట్ శంకర్’ రూపంలో బ్లాక్ బస్టర్ అందించిన సంగతి తెలిసిందే. ఆ కృతజ్ఞతతోనే పూరీ అడిగిన వెంటనే రామ్ ఈ సినిమాలో ఆకాశ్ తో కలిసి అదిరిపోయే లెవెల్లో డ్యాన్స్ చేశారని సమాచారం. మొత్తం మీద పూరీ జగన్నాథ్ తనయుడి సినిమా కోసం టాలీవుడ్ లో తన పరపతి అంతా ఉపయోగించి.. సినిమాను సక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు అర్ధమవుతోంది. మరి రొమాంటిక్ చిత్రం ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.