తగ్గని కరోనా జోరు

ABN , First Publish Date - 2020-08-15T09:41:24+05:30 IST

కరోనా విజృంభణ కొనసాగుతోంది. శుక్రవారం మరో 885 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. వీటితో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 23,814కు చేరింది.

తగ్గని కరోనా జోరు

మరో 885 మందికి పాజిటివ్‌

జిల్లాలో 23,814కు చేరిన కరోనా కేసులు

18,220 మంది డిశ్చార్జి

రికార్డు స్థాయిలో  శుక్రవారం ఒక్కరోజే 1752 మంది...

ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్న 5,432 మంది

వైరస్‌ బారినపడి మరో ఆరుగురు మృతి

162కు చేరిన మొత్తం మరణాలు 


విశాఖపట్నం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి):

కరోనా విజృంభణ కొనసాగుతోంది. శుక్రవారం మరో 885 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. వీటితో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 23,814కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 18,220 మంది కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, మరో 5,432 మంది వివిధ ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. తాజాగా, వైరస్‌ బారినపడి మరో ఆరుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 162కు చేరింది. కాగా రికార్డు స్థాయిలో శుక్రవారం ఒక్కరోజే 1752 మంది డిశ్చార్జ్‌ అయినట్టు అధికారులు తెలిపారు. మరికొద్దిరోజులపాటు వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా వుండే అవకాశం వున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 


గోపాలపట్నంలో 13.. 

గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లో 13 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. స్థానిక అజంతా పార్క్‌లో నలుగురు, నరసింహనగర్‌లో నలుగురు, శ్రీరామ్‌నగర్‌లో ఒకరు, దోభీకాలనీలో ఇద్దరు, ప్రశాంతినగర్‌లో ఇద్దరు వైరస్‌ బారినపడ్డారు. 


భీమిలిలో 10..

  • భీమిలి జోన్‌ నాలుగో వార్డు పరిధి చేపలుప్పాడలో పలువురికి పరీక్షలు నిర్వహించగా పది మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పెదఉప్పాడలో ఇద్దరికి, చిన ఉప్పాడ, మంగమారిపేటలకు చెందిన ఒక్కొక్కరికి, వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఆరుగురికి వైరస్‌ సోకి. 
  • సింహాచలంలోని గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో 69, 72 వార్డులకు చెందిన 68 మందికి పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 
  • ఆనందపురం మండలంలో మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. వెల్లంకిలో ఇద్దరికి, వేములవలసలో ఒకరికి, బోనిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 
  • పద్మనాభం మండలంలో మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బీఆర్‌ తాళ్లవలసకు చెందిన ఇద్దరికి, పొట్నూరుకు చెందిన ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 
  • సబ్బవరం మండలంలో మరో రెండు కేసులు నమోదయ్యాయి. బలిజపాలేనికి చెందిన యువకుడు, పాత సబ్బవరానికి  చెందిన యువకుడు వైరస్‌ బారినపడ్డారు.
  • ఆరిలోవ రిఫరల్‌ వైద్యశాలలో వంద మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒక్కరికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 


అనకాపల్లిలో 32

అనకాపల్లి టౌన్‌, ఆగస్టు 14: పట్టణంలో శుక్రవారం మరో 32 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్‌ బారిన పడినవారి సంఖ్య 986కు చేరింది. గవరపాలెంలో ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు, శ్రీరామ్‌నగర్‌ కాలనీలో ముగ్గురు పురుషులు, ఏఎంసీ కాలనీలో మహిళ, కుంచావారి వీధిలో మహిళ, శారదా నగర్‌లో బాలుడు, మహిళ, పురుషుడు, వేల్పుల వీధిలో పురుషుడు, న్యూకాలనీలో మహిళ, కస్పావీధిలో మహిళకు కరోనా సోకింది. గాంధీనగర్‌లో మహిళ, పురుషుడు, అంజయ్య కాలనీలో పురుషుడు, కోట్ని వీధిలో మహిళ, చినరాజుపేటలో పురుషుడు, తాకాశి వీధిలో మహిళ, నాగవంశం వీధిలో ఇద్దరు పురుషులు, నరసింగరావుపేటలో మహిళ, లక్ష్మీదేవిపేటలో పురుషుడు, ఫైర్‌ స్టేషన్‌లో రోడ్డులో పురుషుడు కరోనా వైరస్‌బారిన పడ్డారు. 


మన్యంలో 28  

పాడేరు: ఏజెన్సీలో శుక్రవారం 130 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, వీరిలో 28 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. చింతపల్లి మండలంలో 11 మంది, పాడేరులో ఏడుగురు, సీలేరులో ఐదుగురు, అనంతగిరిలో ఇద్దరు, అరకులోయలో ఇద్దరు, కొయ్యూరులో ఒకరు వైరస్‌ బారినపడ్డారు. 


పాయకరావుపేటలో 18

పాయకరావుపేట మండలంలో మరో 18 మంది పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పట్టణంలో హోంగార్డు భార్య, మహిళా పోలీసు, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇందిరాకాలనీలో ఇద్దరు పురుషులు, బృందావనంలో ఇద్దరు మహిళలు, పురుషుడు, రాజుగారిబీడులో ముగ్గురు పురుషులు, పెదిరెడ్డివారి కాలనీలో ఇద్దరు పురుషులు, పెంటకోటలో గర్భిణి, మహిళ, మంగవరంలో గర్భిణి, బాలిక వైరస్‌ బారినపడ్డారు.


వడ్డాది పీహెచ్‌సీ పరిధిలో 14

బుచ్చెయ్యపేట మండలం వడ్డాది పీహెచ్‌సీ పరిధిలో మరో 14 కరోనా కేసులు నమోదయ్యాయి. వడ్డాది పెదబజారు వీధిలో మహిళ, ముగ్గురు పురుషులు, దొరబాబు కాలనీలో మహిళ, యువకుడు, వడ్డాది జంక్షన్‌లో పురుషుడు, మంగళాపురంలో యువతి, ఎన్‌ఎస్‌పేటలో పురుషుడు, పీఎస్‌పేట సిటిజన్‌ కాలనీలో ఇద్దరు పురుషులు, మాడుగుల మండల వీరవల్లి అగ్రహారంలో పురుషుడు, మహిళ, చోడవరం మండలం గౌరీపట్నంలో పురుషుడు వైరస్‌ బారిన పడినట్టు పీహెచ్‌సీ వైద్యాధికారిణి శకుంతల తెలిపారు. 


కశింకోట మండలంలో 13.... 

కశింకోట మండలంలో 13 మంది కరోనా బారినపడ్డారు. కశింకోట పీహెచ్‌సీ పరిధిలో డిప్యూటీ తహసీల్దార్‌, అఫీషియల్‌ కాలనీలో పురుషుడు, పూసర్ల వీధిలో మహిళ, విస్సన్నపేటలో యువకుడు, శారదానగర్‌లో మహిళ, పిసినికాడలో మహిళ, సత్యనారాయణపురంలో ఇద్దరు పురుషులకు వైరస్‌ సోకింది. తాళ్లపాలెం పీహెచ్‌సీ పరిధిలోని నరసింగబిల్లిలో పదేళ్ల బాలిక, పురుషుడు, మహిళ, తాళ్లపాలెంలో ఇద్దరు పురుషులు వైరస్‌ బారిన పడ్డారు.


‘నర్సీపట్నం’లో 11

నర్సీపట్నం మునిసిపాలిటీలో మరో తొమ్మిది మంది కరోనా బారినపడ్డారు. వీరిలో డిపూటీ తహసీల్దార్‌, అయ్యన్నపాలెంలో పురుషుడు, వెంకునాయుడుపేటలో పురుషుడు, 20వ వార్డులో ఇద్దరు మహిళలు, ధనిమిరెడ్డివారి వీధిలో యువతి, బొంతువీధిలో యువకుడు, పెదబొడ్డేపల్లిలో ఇద్దరు పురుషులు వున్నారు. నర్సీపట్నం మండలంలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. దుగ్గాడ, వేములపూడిలో ఒక్కొక్క మహిళ వైరస్‌బారిన పడ్డారు.


చోడవరం మండలంలో 11 

చోడవరం మండలంలో 11 కరోనా కేసులు నమోదయ్యాయి. శ్రీరాంపట్నం పంచాయతీలో ఒకే కుటుంబంలో నలుగురు పురుషులు, గోవాడలో పురుషుడు, లక్కవరంలో పురుషుడు, చోడవరం గోవిందమ్మకాలనీలో పురుషుడు, అంబేడ్కర్‌ కాలనీలో పురుషుడు, మారుతీనగర్‌లో వృద్ధురాలు, వెంకన్నపాలెంలో యువకుడు, గౌరీపట్నంలో పురుషుడు వైరస్‌బారిన పడ్డారు.


కోటపాడు మండలంలో 11  

కె.కోటపాడు మండలంలో 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కె.కోటపాడులో ఇద్దరు వృద్ధులు, సింగన్నదొరపాలెంలో మహిళ, చంద్రయ్యపేట, గుల్లేపల్లి, గొంపవానిపాలెం, రొంగలినాయుడుపాలెంలో ఒక్కొక్క యువకుడు, ఆర్‌వైఅగ్రహారంలో భార్యాభర్తలు, ఒకే కుటుంబంలో ఇద్దరు యువకులు వైరస్‌బారిన పడ్డారు.


రావికమతం పీహెచ్‌సీ పరిధిలో 10...

రావికమతం పీహెచ్‌సీ పరిధిలో శుక్రవారం పది మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. రావికమతంలో మహిళ, ఇద్దరు పురుషులు, మేడివాడలో ఏడేళ్ల బాలిక, పురుషుడు, తట్టబందలో ఇద్దరు గ్రామ వలంటీర్లు, పిల్లవానిపాలెంలో పురుషుడు, బుడ్డిబందలో పురుషుడు, తోటకూరపాలెంలో గర్భిణి కరోనా బారిన పడినట్టు వైద్యాధికారి డాక్టర్‌ టీవీఎస్‌ నాయుడు తెలిపారు. కాగా తోటకూరపాలెంలో పాజిటివ్‌ వచ్చిన గర్భిణికి ప్రైమరీ కాంటాక్టుగా వున్న భర్త, ఆమె తల్లిదండ్రులకు కరోనా పరీక్షల కోసం వైద్య సిబ్బంది వెళ్లగా, వారు ఇంటిలో లేరని సమాచారం వచ్చిందన్నారు.


శరభన్నపాలెంలో ఐదు...

  • అరకులోయ ఎంపీ జి.మాధవి స్వగ్రామమైన కొయ్యూరు మండలం శరభన్నపాలెంలో కృష్ణాదేవిపేట పీహెచ్‌సీ వైద్యాధికారిణి ప్రణతి శుక్రవారం 50 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో గ్రామంలో కేసుల సంఖ్య 13కు చేరింది. ఎంపీ దగ్గరుండి పరీక్షలు చేయించారు. 
  • దేవరాపల్లి మండలం వేచలం పీహెచ్‌సీ పరిధిలో మూడు పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు వైద్యాధికారి బి.హారిక తెలిపారు. కొత్తపెంటలో భార్యాభర్తలు, మామిడిపల్లిలో యువకుడు వైరస్‌బారిన పడ్డారు. 
  • అచ్యుతాపురం మండలంలో మూడు పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు వైద్యాధికారిణి కనకమహాలక్ష్మి తెలిపారు. సెజ్‌ పునరావాస కాలనీ గురజాపాలెంలో పురుషుడు, చోడపల్లి పంచాయతీ మోసయ్యపేటలో పురుషుడు, దోసూరులో యువకుడు వైరస్‌ బారిన పడ్డారు.
  • మునగపాక మండలం టి.సిరసపల్లిలో పురుషుడు, కుంచెవానిపాలెంలో యువకుడు, గణపర్తిలో పురుషుడు వైరస్‌ బారిన పడ్డారు.
  • గొలుగొండ మండలం చీడిగుమ్మలలో మహిళ, జమ్మవరంలో యువకుడు వైరస్‌ బారిన పడ్డారని పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ ధనలక్ష్మి తెలిపారు.
  • అనంతగిరి మండలం గుమ్మకోట వీఆర్‌వో, రొంపల్లి పంచాయతీ కార్యదర్శి కరోనా వైరస్‌బారిన పడ్డారు. వీరిని పాడేరు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తరలించారు.
  • కోటవురట్ల మండలం సుంకపూర్‌లో యువకుడు, పందూరు శివారు ముడగలలోవలో యువకుడు కరోనా వైరస్‌ బారినపడ్డారని కె.వెంకటాపురం వైద్యాధికారి శ్రీనివాసరాజు తెలిపారు.

Updated Date - 2020-08-15T09:41:24+05:30 IST