జీహెచ్ఎంసీ పరిధిలో మరో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు

ABN , First Publish Date - 2021-06-20T01:22:40+05:30 IST

జీహెచ్ఎంసీ పరిధిలో మరో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు తెలంగాణ కేబినెట్‌

జీహెచ్ఎంసీ పరిధిలో మరో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో మరో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. టిమ్స్‌ను ఇకపై ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించాలని తెలంగాణ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 




అలాగే గొర్రెల పెంపకం పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. నాయిబ్రాహ్మణుల కోసం మోడ్రన్ సెలూన్ల ఏర్పాటు చేయాలని కేబినెట్‌ ఆదేశించింది. చేనేత, గీత కార్మికులకు బీమా త్వరగా అందించాలని కేబినెట్‌ సూచించింది. వివిధ వృత్తి కులాల ఎంబీసీ కార్పొరేషన్‌కు నిధులు విడుదల చేయాలని తెలంగాణ కేబినెట్ ఆదేశించింది. 

Updated Date - 2021-06-20T01:22:40+05:30 IST