వారం రోజుల్లో మరో 250 ఆక్సిజన్‌ పడకలు

ABN , First Publish Date - 2021-05-11T04:37:18+05:30 IST

కరోనా బాధితులకు మరిన్ని నాణ్యమైన వైద్యసేవల్లో భాగంగా ఈ వారం రోజుల్లో మరో 250 ఆక్సిజన్‌ పడకలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

వారం రోజుల్లో మరో 250 ఆక్సిజన్‌ పడకలు
హైఫ్లో నాసల్‌ యంత్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి

- కరోనా తర్వాత కొత్తగా 600 పడకల ఆస్పత్రి నిర్మాణానికి సన్నాహాలు

- పోస్ట్‌మార్టం గది ఆధునికీకరణకు

 సీఎం అంగీకారం

- రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

- ఐఎంఏ ఆధ్వర్యంలో ఓ ఎన్‌ఆర్‌ఐ

 హైఫ్లో నాసల్‌ యంత్రం అందజేత

మహబూబ్‌నగర్‌(వైద్యవిభాగం) మే 10: కరోనా బాధితులకు మరిన్ని నాణ్యమైన వైద్యసేవల్లో భాగంగా ఈ వారం రోజుల్లో మరో 250 ఆక్సిజన్‌ పడకలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. జిల్లా ఐఎంఏ ఆధ్వర్యంలో ప్రభుత్వజనరల్‌ ఆస్పత్రికి అంద జేసిన ఓ ఎన్‌ఆర్‌ఐ హైఫ్లో నాసల్‌ యంత్రాన్ని సోమ వారం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. గత ఏడాది 260 పడకలతో ప్రత్యేకంగా కొవిడ్‌ హెల్త్‌కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామని, అందు లో అన్ని పడకలకు ఆక్సిజన్‌,  వెంటిలేటర్లు అందు బాటులోకి తెచ్చామని, లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకును కూడా ఏర్పాటు చేశామని అన్నారు. అయితే ప్రస్తుతం పెరుగుతున్న రోగులకు ఇబ్బందులు కలగకుండా ఈ వారం రోజుల్లో అదనంగా మరో 250 ఆక్సిజన్‌  పడక లను అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొన్నారు. దీం తో పాటు కరోనా వైరస్‌ అదుపులోకి వచ్చిన తర్వాత జనరల్‌ ఆసుపత్రికి అనుసంధానంగా మరో 600 ప డకలతో కొత్తగా ఆస్పత్రి నిర్మాణాన్ని చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని, అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పోస్ట్‌మార్టం గదిని కూడా ఆధునికీకరించనున్నా మని, ఈ రెండింటికి సీఎం కేసీఆర్‌ అంగీకారం తెలిపి నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రిపై ప్రజలకు విశ్వాసం కలిగిందని, అందుకే ప్రైవేటుకు వెళ్లకుండా జనరల్‌ ఆస్పత్రికి వస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 200మంది కరోనా రోగులు పూర్తిగా నయమై ఇంటికి ఆరోగ్యంగా వెళ్లారని అన్నా రు. అయితే ప్రస్తుతం పెరుగుతున్న రోగులకు పడక లు సరిపోవడం లేదని, దీన్ని దృష్టిలో ఉంచుకొని అ దనంగా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. హైదరా బాద్‌ తరహాలో బస్తీ దవాఖానాలను  కూడా ఏర్పాటు చేయిస్తామన్నారు. కరోనా బాధితులు హైదరాబాద్‌ వెళ్లాల్సిన అవసరం లేకుండా రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు, మందులు ఆసుపత్రిలో ఉచితంగానే అందజేస్తున్నా మని, అన్ని రకాల సౌకర్యాలు, వైద్యసేవలు అందుబా టులోకి తెచ్చామన్నారు.  కొత్తగా మరో ఆర్‌టీపీ సీఆర్‌ యంత్రాన్ని కూడా అందుబాటులోకి తెచ్చామని, ఇన్‌స్టాలేషన్‌ ప్రక్రియ జరుగుతుందన్నారు. కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఏమాత్రం లక్షణాలు కని పించినా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయిం చుకోవాలన్నారు. వైద్యసిబ్బంది కొరత లేదని, రెండు నె లల్లో 160 మంది వైద్యులు, వైద్యసి బ్బందిని నియ మించామన్నారు. ఆస్పత్రులకు చివరిక్షణంలో కాకుం డా ముందస్తుగా రావాలని, వారికి నయం చేసేందుకు అవకాశం ఉందన్నారు.  కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ కే.సీ నర్సింహులు, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాంకిషన్‌, డిప్యూటీ సూప రింటెండెంట్లు జీవన్‌, నర్సింహరావు, ఐఎంఏ జిల్లా అ ధ్యక్షుడు డాక్టర్‌ రాంమోహన్‌, సభ్యులు డాక్టర్‌ మధు సూదన్‌రెడ్డి, డాక్టర్‌ శ్యామ్యూల్‌, డాక్టర్‌ సునీల్‌, డాక్టర్‌ విజయ్‌కాంత్‌, డాక్టర్‌ సంపత్‌  పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T04:37:18+05:30 IST