మరో 24 కేసులు

ABN , First Publish Date - 2020-06-26T10:08:18+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల పరంపర కొనసాగుతోంది. గురువారం మరో 24 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య

మరో 24 కేసులు

657 చేరిన పాజిటివ్‌ కేసులు

28 మంది డిశ్చార్జి


కడప, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల పరంపర కొనసాగుతోంది. గురువారం మరో 24 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖాధికారులు వెల్లడించారు. దీంతో మొత ్తం కరోనా బాధితుల సంఖ్య 657కు చేరుకుంది. కొత్తగా నమోదైన పాజటివ్‌ కేసులు పరిశీలిస్తే.. ప్రొద్దుటూరు 9, సింహాద్రిపురం 4, పులివెందుల 2, గాలివీడు 3, పోట్లదుర్తి 1, కడప 1, చెన్నూరు 1, విదేశాల నుంచి వచ్చిన ముగ్గురిలో పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 


28 మంది డిశ్చార్జి

కడపలోని ఫాతిమా ఆసుపత్రిలో చికిత్స పొంది 28 మంది కోవిడ్‌-19 బాధితులు సంపూర్ణంగా కోలుకుని డిశ్చార్జి అయినట్లు కలెక్టరు హరికిరణ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మైలవరం మండలానికి చెందిన 11 మంది, పోరుమామిళ్లకు చెందిన నలుగురు, ప్రొద్దుటూరుకు చెందిన ఇద్దరు, జమ్మలమడుగుకు చెందిన ఇద్దరు, కడపకు చెందిన ముగ్గురు, ఒంటిమిట్ట, సంబేపల్లె, టి.సుండుపల్లెకు చెందినవారు ఒక్కొక్కరు, విదేశాల నుంచి వచ్చిన ముగ్గురు డిశ్చార్జి అయినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 298 మంది చికిత్స పొంది సంపూర్ణంగా కోలుకున్నారన్నారు. 


నేటి నుంచి జిల్లెల్ల నాన్‌ కంటైన్మెంటు జోన్‌

పోరుమామిళ్ల మండలంలోని జిల్లెల్ల గ్రామం శుక్రవారం నుంచి నాన్‌ కంటైన్మెంటు జోన్‌ పరిధిలోకి వస్తున్నట్లు కలెక్టరు తెలిపారు. ఓ కంటైన్మెంటు జోన్‌ పరిధిలో చివరి పాజిటివ్‌ కేసు నమోదై 28 రోజుల వరకు ఎటువంటి కేసు నమోదు కాని పక్షంలో ఆ కంటైన్మెంటు జోన్‌లోని ఆంక్షలు ఎత్తివేసి నాన్‌ కంటైన్మెంటు జోన్‌గా ప్రకటిస్తామన్నారు. 28 రోజులుగా జిల్లెల్లలో కేసు నమోదు కాకపోవడంతో నిషేదాజ్ఞలు ఎత్తివేస్తున్నట్లు వెల్లడించారు. 


కోవిడ్‌-19 సమాచారం

మొత్తం శాంపిల్స్‌  - 63588

రిజల్ట్‌ వచ్చినవి  - 60026

నెగటివ్‌ - 59369

పాజిటివ్‌ - 657

డిశ్చార్జ్‌ అయినవారు - 298

రిజల్ట్‌ రావాల్సినవి - 3562

25వ తేదీ తీసిన శాంపిల్స్‌  - 1077

Updated Date - 2020-06-26T10:08:18+05:30 IST