మరో 18 పాజిటీవ్‌లు

ABN , First Publish Date - 2020-07-03T10:09:24+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం మరో 18 కేసులు రికార్డుకెక్కాయి.

మరో 18 పాజిటీవ్‌లు

నెల్లూరులోనే అత్యధికం


నెల్లూరు (వైద్యం), జూలై 2 : జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం మరో 18 కేసులు రికార్డుకెక్కాయి. వీటిలో నెల్లూరు నగరంలోనే 12 ఉన్నాయి. దర్గామిట్టలో 2, వేదాయపాళెంలో 2, హరనాధపురంలో 1, మాగుంటలేఅవుట్‌లో 1, పడారుపల్లిలో 1, ఎన్టీఆర్‌ నగర్‌లో 1, చిన్నబజారులో 1, పెద్దబజారులో 1, సంతపేటలో 1, కోటమిట్టలో 1, కావలిలో 2, కలిగిరి మండలం కుడుములదిన్నెలో 1, ప్రకాశం జిల్లా వాసులు 2, అనంతపురం జిల్లాకు చెందిన ఒకరికి కరోనా సోకింది. అలాగే 13 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్‌ అయ్యారు. సంగం-1, వింజమూరు-2, ఏఎస్‌పేట-1, కలిగిరి-2, ఉదయగిరి-1, సూళ్లూరుపేట-1, కావలి-2, పాటూరు-1, నెల్లూరు-2 వంతున డిశ్చార్జ్‌ చేశారు.


 రెండు మండలాల్లో తొలిసారిగా..

ఒక్క కేసు కూడా నమోదవని విడవలూరు, చిల్లకూరు మండలాల్లోనూ కరోనా సోకింది. విడవలూరు మండలం పార్లపల్లి  దళితవాడకు చెందిన 32 ఏళ్ల వ్యక్తికి వైరస్‌ సోకడంతో ఎమ్పీడీవో  సాయి ప్రసాద్‌, ఎస్‌ఐ మహేంద్రనాథ్‌ అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా పారిశుధ్య పనులు చేపట్టారు. ఆరోగ్య సిబ్బందితో కలసి గ్రామంలో వైద్య పరీక్షలు చేపట్టారు. చిల్లకూరు మండలంలోని చింతవరంలో  ఓ యువకుడు (26) శ్రీసిటీ లో పనిచేస్తూ జ్వరం వస్తుండడంతో గ్రామానికి వచ్చాడు. నెల్లూరులోని జీజీహెచ్‌లో వైద్యపరీక్షలు జరపగా  పాజిటివ్‌ రావడంతో ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. తహసీల్దార్‌ రవికుమార్‌, ఎంపీడీవో శ్రీనివాసరావు, వైద్యురాలు పావని, ఎస్‌ఐ హుస్సేన్‌బాషా గ్రామంలో పర్యటించి పారిశుధ్య పనులు చేయించారు.

Updated Date - 2020-07-03T10:09:24+05:30 IST