Abn logo
May 11 2021 @ 03:49AM

మరో 1543 కరోనా కేసులు... ఆరు మరణాలు

తిరుపతి, మే 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆది, సోమవారాల నడుమ 24 గంటల వ్యవధిలో 1543 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.రాష్ట్ర బులెటిన్‌ మేరకు ఆరు మరణాలు సంభవించాయి. తాజా కేసులు, మర ణాలతో ఇప్పటివరకూ నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 141480కి చేరుకోగా మరణాలు 1033కు చేరాయి. కాగా సోమవారం ఉద యానికి యాక్టివ్‌ పాజిటివ్‌ల సంఖ్య 20021కి చేరింది.తాజా కేసుల్లో తిరుపతిలో 351, తిరుపతి రూరల్‌లో 97, మదనపల్లెలో 90, చిత్తూరులో 72, పీలేరులో 68, శ్రీకాళహస్తిలో 64, చంద్రగిరిలో 47, పలమనేరులో 46, జీడీనెల్లూరులో 39, కురబలకోటలో 38, ఐరాల, కార్వేటినగరం మండలాల్లో 37 చొప్పున, పెనుమూరులో 34, రామచంద్రాపురం, వెదురుకుప్పం మండ లాల్లో 30 వంతున, పుంగనూరులో 29, వి.కోటలో 28, పూతలపట్టులో 25, నిమ్మనపల్లెలో 24, బంగారుపాలెంలో 20, పులిచెర్లలో 19, బి.కొత్తకోట, కలికిరి మండలాల్లో 18 వంతున, కేవీబీపురంలో 17, పాలసముద్రం, శాంతి పురం, శ్రీరంగరాజపురం, తవణంపల్లె మండలాల్లో 13 వంతున, బైరెడ్డిపల్లె, గుర్రంకొండ, నగరి మండలాల్లో 12 చొప్పున, పుత్తూరులో 11, నాగలాపురం, రొంపిచెర్ల, సదుం, వడమాలపేట మండలాల్లో 10 వంతున, రేణిగుంటలో 9, చిన్నగొట్టిగల్లు, నిండ్ర, పీటీఎం, సత్యవేడు మండలాల్లో 8 వంతున, తొట్టంబేడులో 7, పాకాల, తంబళ్లపల్లె మండలాల్లో 6 చొప్పున, కేవీపల్లె, కుప్పం, వాల్మీకిపురం, ఏర్పేడు, ఎర్రావారిపాలెం మండలాల్లో 5 చొప్పున, గుడుపల్లె, కలకడ, నారాయణవనం, పెద్దపంజాణి, రామ సముద్రం, సోమల మండలాల్లో 4 చొప్పున, బీఎన్‌ కండ్రిగ, పెద్దమండ్యం మండలాల్లో 3 వంతున, చౌడేపల్లె, గంగవరం, ములకలచెరువు మండలాల్లో 2 చొప్పున, గుడిపాల, రామకుప్పం, వరదయ్యపాలెం, విజయపురం, యాదమరి మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున కొత్తగా కేసులు నమోదయ్యాయి.


కొవిడ్‌తో ఇద్దరు ఉద్యోగులు, ఓ మాజీ ఎంపీటీసీ మృతి

మరోవైపు గడిచిన 24 గంటల్లో కొవిడ్‌తో పలువురు మరణించారు. తిరుపతి రూరల్‌ మండలం పెరుమాళ్ళపల్లె పంచాయతీ కార్యదర్శి జీవన్‌ ప్రసాద్‌రెడ్డి (56) సోమవారం ఉదయం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన స్వస్థలం ఐరాల మండలం యలమంచి గ్రామం. సోమల మండలం ట్రాన్స్‌కో లైన్‌ ఇన్స్‌పెక్టర్‌ ప్రభాకర్‌ కూడా కరోనాతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ సోమవారం ఉదయం మృతిచెందారు. ఆయన స్వస్థలం కలికిరి మండలం గుట్టపాలెం గ్రామం. అదే మండలంలో కలికిరి మాజీ ఎంపీటీసీ, టీడీపీ నాయకుడు అజంతుల్లా ఆదివారం రాత్రి కొవిడ్‌తో చనిపోయారు. పుంగ నూరులో ఆలిండియా కరాటే అసోసియేషన్‌ శాఖ మాజీ అధ్యక్షుడు మహేష్‌ కూడా కరోనా బారిన పడి సోమవారం మరణించారు. సోమల మండలం వలిగట్ల పంచాయతీ సచివాలయంలో ఓ ఉద్యోగికి సోమవారం కొవిడ్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో సహచర ఉద్యోగులు కార్యాల యానికి వెళ్ళేందుకు నిరాకరించడంతో సచివాలయం తాత్కాలికంగా మూతపడింది.


రుయాలో దళితమోర్చా నేత రామారావు కన్నుమూత 

 చిత్తూరు పార్లమెంటు బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడు పీఎస్‌ రామా రావు కరోనాతో మృతి చెందారు.వారంరోజుల క్రితం శ్వాబ్‌ పరీక్షలో పాజిటివ్‌ రావడంతో రుయాస్పత్రిలో చేరిన ఆయన సోమవారం రాత్రి ఆక్సిజన్‌ సరఫరాలో తలెత్తిన అంతరాయంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.  

Advertisement