మరో 10 కరోనా పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-06-01T10:22:43+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్‌ ప్రభావం జిల్లాపై తన ప్రతాపం

మరో 10 కరోనా పాజిటివ్‌ కేసులు

8మంది బాధితుల డిశ్చార్జి


నెల్లూరు (వైద్యం)మే 31 : జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్‌ ప్రభావం జిల్లాపై తన ప్రతాపం చూపుతుంది. ఆదివారం జిల్లా వ్యాప్తంగా 10 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తడ మండల కేంద్రం అరుంధతి వాడకు చెందిన నలుగురు కరోనా పాజిటివ్‌కు గురయ్యారు. సూళ్లూరుపేట మహదేవపురం, గాండ్లవీధికి చెందిన ఒక్కోక్కరు పాజిటివ్‌కు గురయ్యారు. ఉదయగిరి మండలం అప్పసముద్రంకు చెందిన ఇద్దరు, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఇద్దరు వలస కూలీలు కరోనా పాజిటివ్‌కు గురయ్యారు. తెనాలికి చెందిన వీరిని నెల్లూరు నగరం జాబితాలోనే చేర్చారు. దీంతో మొత్తం జిల్లాలో 251 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అలాగే మరో 8 మంది పాజిటివ్‌ బాధితులు చికిత్సల అనంతరం వైద్యాధికారులు డిశ్చార్జ్‌ చేశారు. సూళ్లూరుపేటకు చెందిన 6 మంది, నాయుడుపేట, కావలికి చెందిన ఒక్కోక్కరు డిశ్చార్జ్‌ అయ్యారు. వీరంతా జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారే. దీంతో మొత్తం డిశ్చార్జ్‌ అయిన వారు 188 మందిగా ఉన్నారు.


Updated Date - 2020-06-01T10:22:43+05:30 IST