కనుల పండువగా ముసుగుల సేవ

ABN , First Publish Date - 2021-03-02T05:13:54+05:30 IST

నవాబుపేట ఉడయవర్లు దేవస్థానంలో సోమవారం రాత్రి ముసుగుల సేవ ఉత్సవం కనుల పండువగా జరిగింది.

కనుల పండువగా ముసుగుల సేవ
ముసుగుల సేవకు తరలుతున్న స్వామి, అమ్మవార్లు

ముగిసిన బ్రహ్మోత్సవాలు

నెల్లూరు(సాంస్కృతికం),  మార్చి 1 : నవాబుపేట ఉడయవర్లు దేవస్థానంలో సోమవారం రాత్రి ముసుగుల సేవ ఉత్సవం కనుల పండువగా జరిగింది. స్వామివారికి - అమ్మవార్లకు ముసుగుల సేవ సంప్రదాయాన్ని అర్చక స్వాములు ఆకట్టుకునేలా జరిపించారు. ఉదయం సుప్రభాతసేవ, ఆరాధన, నివేదన జరిగాయి. అనంతరం మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు జరిగింది. పూర్ణాహుతి, చక్రస్నానం, ధ్వజావరోహణం, ఏకాంత సేవలు నిర్వహించారు. ఉభయదాతలుగా నాగిశెట్టి మురళీ, కృష్ణకల్యాణి వ్యవహరించారు. ఈ వేడుకతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉత్సవాలను ఆలయ వంశపారంపర్య ధర్మకర్త రామకృష్ణమాచార్యులు, యజ్ఞాచార్యులు, పల్లాప్రోలు విష్వక్సేనాచార్యులు పర్యవేక్షించారు.

Updated Date - 2021-03-02T05:13:54+05:30 IST