ఏరువాక వేడుక

ABN , First Publish Date - 2020-06-06T09:25:28+05:30 IST

ఏరువాక పౌర్ణమి.. వ్యవసాయానికి నాందీ.. సాగు సంబరాలు మొదలయ్యే రోజు..

ఏరువాక వేడుక

ఆదోని/ఆలూరు, జూన్‌ 5: ఏరువాక పౌర్ణమి.. వ్యవసాయానికి నాందీ.. సాగు సంబరాలు మొదలయ్యే రోజు.. ఎద్దులను ఆత్మీయంగా పూజించే ఆనవాయితీ.. పల్లెలకు ఇవన్నీ శుక్రవారం కలిసి వచ్చాయి. ఆదోని, ఆలూరు మండలాల్లో రైతులు ఏరువాక పౌర్ణమి ఘనంగా నిర్వహించారు. ఎద్దులకు రంగులు అద్దారు. పూలతో అలంకరించారు. సాయంసంధ్యా సమయాన ఎద్దుల పారువేట నిర్వహించారు. పారువేట తిలకించేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. ముఖ్యంగా ఎద్దులకు రాజకీయ రంగులు అద్దారు. మదిరె, నారాయణపురం, ఢనాపురం, పెద్దహరివాణం, సంతెకుడ్లూరు తదితర గ్రామాల్లో ఎద్దుల పారువేట నిర్వహించారు. 

Updated Date - 2020-06-06T09:25:28+05:30 IST