Advertisement
Advertisement
Abn logo
Advertisement

సమస్యలు పరిష్కరించాలని ఏఎన్‌ఎంల ఆందోళన

జగిత్యాల టౌన్‌. డిసెంబరు 8: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరిం చాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ఉమెన్‌ ఏఎన్‌ఎం వేల్ఫేర్‌ అసోసియేషన్‌ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఆశ కార్యకర్తలతో కలిసి ఏఎన్‌ఎంలు కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన నిర్వహిం చారు. జగిత్యాల-కరీంనగర్‌ ప్రధాన రహదారాపై రెండు గంటలపాటు భైఠా యించి ధర్నా నిర్వహించారు. ధర్నా నిర్వహిస్తున్న సమయంలో ఎండ వేడిమికి తాళలేక ఇద్దరు ఏఎన్‌ఎంలు సొమ్మసిల్లి పడిపోయారు. పక్కనే ఉన్న ఏఎన్‌ఎం లు చికిత్స అందించారు. అనంతరం ఏఎన్‌ఎం వేల్ఫేర్‌ అసోసియేషన్‌ జగిత్యాల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శురాళ్లు మధురిమ, మమత, అరుణ కుమారిలు మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పనివేళలు కల్పించి ఉద్యోగ భధ్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌లో పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్‌ చేయాలన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా వెద్యాధికారికి అందజేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో స్వరూప, వసంత, నీరజ, పద్మ, భాగ్యలక్ష్మి, సుప్రియ, శోభారాణి, జయప్రద, రజిత, సౌజన్య ప్రశాంతి తదితరులు ఉన్నారు.

ధర్నాలో చిక్కుకున్న పెళ్లి కూతురు

జగిత్యాల కలెక్టరేట్‌ ఎదుట ఏఎన్‌ఎంలు బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్నాహ్నం ఒంటి గంట వరకు కరీంనగర్‌-జగిత్యాల ప్రధాన రహ దారిపై భైఠాయించి రెండు గంటలకుపైగా ధర్నా నిర్వహించారు. దీంతో రహదారికి ఇరువైపులా కిలోమీటర్‌ వరకు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్ప డింది. పట్టణంలోని తారకరామనగర్‌కు చెందిన నేరెల్ల సత్యనారాయణరెడ్డి- రాజమణి దంపతుల కుమార్తె సాహితి వివాహం నాయీబ్రాహ్మణ సేవా సంఘంలో జరగనుండగా వారి వాహనం ట్రాఫిక్‌లో చిక్కుకుంది. ముహూర్త సమయం 12.35కు ఉండగా హుటాహుటిన పెళ్లి కూతురు సోదరుడు స్వరాజ్‌ కృష్ణ సోదరిని ద్విచక్రవాహనంపై ముహూర్త సమయానికి మండపానికి తరలించాడు. 

Advertisement
Advertisement