భక్తులతో రత్నగిరి రద్దీ

ABN , First Publish Date - 2021-10-17T06:31:37+05:30 IST

సత్యదేవుడి సన్నిధి శనివారం భక్తులతో కిటకిటలాడింది. రత్నగిరిపై వివాహం చేసుకున్న జంటలు, వివిధ ప్రాంతాల్లో పెళ్లిళ్లు చేసుకున్న దంపతులతో పాటు ఏకాదశి పర్వదినం కావడంతో ఎక్కువ మంది వచ్చారు.

భక్తులతో రత్నగిరి రద్దీ

వ్రతాలు చేయించుకుంటున్న భక్తులు
అన్నవరం, అక్టోబరు 16:  సత్యదేవుడి సన్నిధి శనివారం భక్తులతో కిటకిటలాడింది. రత్నగిరిపై వివాహం చేసుకున్న జంటలు, వివిధ ప్రాంతాల్లో పెళ్లిళ్లు చేసుకున్న దంపతులతో పాటు ఏకాదశి పర్వదినం కావడంతో ఎక్కువ మంది వచ్చారు. శనివారం ఒక్కరోజు సుమారు 3 వేల వ్రతాలు జరగ్గా, వివిధ విభాగాల ద్వారా సుమారు రూ.30 లక్షల ఆదాయం లభించింది. నిత్యాన్నదాన పథకానికి శనివారం  అనకాపల్లికి చెందిన పట్టా సుజాత రూ.లక్షను ఆలయ పీఆర్వో కొండలరావుకు సమర్పించారు. 

Updated Date - 2021-10-17T06:31:37+05:30 IST