అన్నారెడ్డిపాళెం విద్యార్థి రాష్ట్రస్థాయి టీమ్‌కు ఎంపిక

ABN , First Publish Date - 2022-08-07T05:16:24+05:30 IST

మండలంలోని అన్నారెడ్డిపాళెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి భాను ప్రకాష్‌ అండర్‌ -14 విభాగం బాలుర షూటింగ్‌ బాల్‌ రాష్ట్రస్థాయి టీమ్‌కు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు మల్లిఖార్జునరెడ్డి తెలిపారు.

అన్నారెడ్డిపాళెం విద్యార్థి రాష్ట్రస్థాయి టీమ్‌కు ఎంపిక
షూటింగ్‌ బాల్‌ క్రీడల్లో రాష్ట్రస్థాయి టీమ్‌కు ఎంపికైన భానుప్రకాష్‌

షూటింగ్‌ బాల్‌లో ప్రతిభ

సంగం, ఆగస్టు 6: మండలంలోని అన్నారెడ్డిపాళెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి భాను ప్రకాష్‌ అండర్‌ -14 విభాగం బాలుర షూటింగ్‌ బాల్‌ రాష్ట్రస్థాయి టీమ్‌కు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు మల్లిఖార్జునరెడ్డి తెలిపారు. ఇటీవల నెల్లూరులో జరిగిన జిల్లా స్థాయి షూటింగ్‌ బాల్‌ అండర్‌ 14 విభాగంలో భానుప్రకాష్‌ ప్రతిభ కనబరిచారు. దీంతో ఆ విద్యార్థి రాష్ట్ర స్థాయి టీమ్‌కు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. విద్యార్థికి సహకరించిన పీఈటీ మస్తానమ్మను అభినందించారు. 

Updated Date - 2022-08-07T05:16:24+05:30 IST