ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణ..!

ABN , First Publish Date - 2020-04-04T10:44:52+05:30 IST

లాక్‌డౌన్‌తో తినేందుకు గుప్పెడు మెతుకులు లేక అల్లాడిపోతున్న వారిని అన్నపూర్ణ కేంద్రాలు అమ్మలా ఆదుకుంటున్నాయి.

ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణ..!

రోజుకు రెండుపూటలా.. 60వేలమందికి..

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌తో తినేందుకు గుప్పెడు మెతుకులు లేక అల్లాడిపోతున్న వారిని అన్నపూర్ణ కేంద్రాలు అమ్మలా ఆదుకుంటున్నాయి. సాధారణంగా మధ్యాహ్న సమయాల్లో రూ.5కే అందించే భోజనాన్ని, లాక్‌డౌన్‌ వల్ల రెండు పూటలా ఉచితంగా అందిస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 150 కేంద్రాల వద్ద ప్రస్తుతం సుమారు 60 వేల మంది ఆకలి తీర్చుకుంటున్నారు. కేవలం నిరాశ్రయులే కాక.. ఆకలేసిన అందరూ కడుపు నింపుకుంటున్నారు. మామూలు రోజుల్లో 38 వేల మంది నిత్యం భోజనం చేస్తుండగా.. ఇప్పుడా సంఖ్య మధ్యాహ్నం 45 వేలు, రాత్రి పూట (68 కేంద్రాల్లో) 15 వేలు కలిపి మొత్తం 60వేలకు చేరింది. భోజన సమయంలోనూ భౌతిక దూరం పాటించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటుండటం గమనార్హం.

Updated Date - 2020-04-04T10:44:52+05:30 IST