Viral: ఈవిడ ఎవరో గుర్తుపట్టారా.. ఎక్కడో చూసినట్టు ఉంది కదూ.. ఇన్నాళ్లకు మళ్లీ వార్తల్లోకి..

ABN , First Publish Date - 2022-08-15T18:46:49+05:30 IST

అన్నపూర్ణి అరసు (Annapoorani Arasu). ఈ పేరు ఎక్కడో చూసినట్టు ఉంది కదూ. ఆవిడేనండి తమిళనాడులోని (Tamilnadu) తిరువణ్ణమలై (Thiruvannamalai) ప్రాంతానికి చెందిన..

Viral: ఈవిడ ఎవరో గుర్తుపట్టారా.. ఎక్కడో చూసినట్టు ఉంది కదూ.. ఇన్నాళ్లకు మళ్లీ వార్తల్లోకి..

తిరువణ్ణమలై: అన్నపూర్ణి అరసు (Annapoorni Arasu). ఈ పేరు ఎక్కడో చూసినట్టు ఉంది కదూ. ఆవిడేనండి తమిళనాడులోని (Tamilnadu) తిరువణ్ణమలై (Thiruvannamalai) ప్రాంతానికి చెందిన స్వప్రకటిత ఆదిపరాశక్తి. మరో మహిళ భర్తతో వివాహేతర సంబంధం (Extra Marital Affair) నడిపి ‘బతుకు జట్కా బండి’ లాంటి షోకు వెళ్లిన ఈవిడ ఆ తర్వాత మాతగా అవతారం ఎత్తి వార్తల్లో నిలిచింది. ఈవిడకంటూ ఇప్పుడొక ఆశ్రమం ఉంది. భక్త బృందం ఉంది. తాజాగా.. అన్నపూర్ణి అరసు మరోసారి వార్తల్లో నిలిచారు. ఆగస్ట్ 14న (Aug 14) ఆవిడ తన ఆశ్రమంలో తన భక్తులకు ప్రత్యేకంగా దర్శనమిచ్చారు. ఏకంగా అమ్మవారి గెటప్‌లో తలపై కిరీటం ధరించి, చేతిలో త్రిశూలం పట్టుకుని, మరో చేతితో దీవిస్తూ ఆవిడ కనిపించేసరికి నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆవిడ అమ్మవారి మాదిరిగా కంఠ హారం కూడా ధరించారు. అంతేకాదు.. ఆమె మెడలో కలువ పూల దండ కూడా ఉంది.



ఒక్కమాటలో చెప్పాలంటే.. అచ్చం అమ్మవారిలానే అలంకారం చేసుకుని అన్నపూర్ణి తన భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ (Viral) కావడంతో మీమ్స్ (Memes), ట్రోల్స్ (Trolls) ఓ రేంజ్‌లో పేలుతున్నాయి. ఈవిడ.. ఇలా ప్రత్యేక దర్శనాలే కాదు ఒక యూట్యూబ్ ఛానల్ (Youtube Channel) క్రియేట్ చేసి అందులో ఆధ్యాత్మికతను కూడా బోధిస్తున్నారు. తిరువణ్ణమలై జిల్లాలోని కిల్పెన్నతూరు సమీపంలోని రాజతొపు ప్రాంతంలో ఈవిడ ఆశ్రమం ఉంది. కుటుంబ సమస్యలకు, మానసిక సమస్యలకు, పెళ్లి సమస్యలకు, సంతానలేమి సమస్యలకు ఆవిడ అనుగ్రహంతో పరిష్కారం దొరుకుతుందని అన్నపూర్ణి భక్త బృందం ప్రకటనలు కూడా ఇచ్చిన వైనం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది.



అసలు ఈ అన్నపూర్ణి మాత నేపథ్యం తెలిస్తే ‘బాబోయ్.. ఇలా కూడా మాతలు పుట్టుకొస్తారా’ అని ఆశ్చర్యం కలగక మానదు. Solvathellem Unmai అనే ఆలుమగల తగవులు తీర్చే షోలో భర్తకు దూరంగా, ప్రియుడికి దగ్గరగా ఉన్న ‘అన్నపూర్ణి’ ఆ షోలో కన్నీటిపర్యంతమైంది. మరో మహిళ భర్తతో వివాహేతర సంబంధం నడిపిన ‘అన్నపూర్ణి’ షోలో పాల్గొన్న వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఇలాంటి మహిళ మాతగా మారి భక్తులను దీవించడం ఏంటని నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. గంగ ‘చంద్రముఖి’గా మారినట్టుగా ‘అన్నపూర్ణి’ అమ్మగా మారడంతో ఆమెకు కొందరు భక్తులు కాళ్లపై పడి పొర్లుదండాలు కూడా పెట్టారు. ఆ వీడియోలు కూడా వైరల్‌గా మారాయి. ఆ వీడియోలను ఎడిట్ చేసి మీమ్స్ పేజ్‌ల్లో తెగ నవ్వులు పూయించారు కొందరు పేజ్ అడ్మిన్లు.

Updated Date - 2022-08-15T18:46:49+05:30 IST