Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

NATS: సాయిదత్త పీఠంలో అన్నమయ్య సంకీర్తన కార్యశాల

twitter-iconwatsapp-iconfb-icon
NATS: సాయిదత్త పీఠంలో అన్నమయ్య సంకీర్తన కార్యశాల

చిన్నారులకు సంకీర్తన నేర్పించిన పద్మశ్రీ శోభారాజు

నాట్స్, కళావేదిక, సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో నిర్వహణ

ఎడిసన్, జూలై 23: అమెరికాలో రేపటి తరానికి కూడా మన సంస్కృతి, సంప్రదాయలను పరిచయం చేయాలనే సంకల్పంతో అమెరికా పర్యటన చేస్తున్న పద్మశ్రీ శోభరాజు న్యూజెర్సీ సాయి దత్త పీఠంలో అన్నమయ్య సంకీర్తన కార్యశాల ఏర్పాటు చేశారు. ఎడిసన్‌‌‌లోని సాయి దత్త పీఠం, కళావేదిక, నాట్స్ కలిసి ఈ కార్యశాల దిగ్విజయం చేశాయి. అన్నమయ్య పద కోకిల శోభారాజు 50 మంది పైగా పిల్లలకు అన్నమయ్య సంకీర్తనలు నేర్పించారు. ఈ కార్యశాలలో నాట్స్, సాయిదత్త పీఠం, కళావేదికతో కలిసి డాక్టర్ శోభారాజుకి వెంకటేశ్వర మీరా బిరుదును న్యూజెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ కమీషనర్ ఉపేంద్ర చివుకుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. 

NATS: సాయిదత్త పీఠంలో అన్నమయ్య సంకీర్తన కార్యశాల

ఈ కార్యక్రమంలో నాట్స్ ఛైర్ విమెన్ అరుణగంటి, నాట్స్ సంబరాలు 2023 కన్వీనర్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ బోర్డు సెక్రటరీ శ్యామ్ నాళం, నాట్స్ బోర్డ్  డైరెక్టర్ రాజ్ అల్లాడ, నాట్స్ మీడియా సెక్రటరీ మురళీకృష్ణ మేడిచెర్ల, దామూ గేదెల, ఉజ్వల్ కస్తల, విష్ణు ఆలురు, వంశీ కొప్పురావూరి, అరుణ్ శ్రీరామ్, బసవ శేఖర్ శంషాబాద్, దివ్య ఏలూరి, టి.ఎఫ్.ఏ.ఎస్ ప్రెసిడెంట్ మధు రాచకళ్ళ, ఉమ మాకం తదితర సభ్యులు పాల్గొన్నారు. సాయి దత్త పీఠం నిర్వాహకులు, చైర్మన్ రఘు శర్మ శంకరమంచి, బోర్డు డైరెక్టర్స్, సభ్యులు, చిన్నారుల తల్లితండ్రులు.. అమెరికాకు విచ్చేసి తన అమూల్యమైన సమయాన్ని ప్రవాస తెలుగువారి కోసం వెచ్చించినందుకు శోభారాజుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

NATS: సాయిదత్త పీఠంలో అన్నమయ్య సంకీర్తన కార్యశాల


NATS: సాయిదత్త పీఠంలో అన్నమయ్య సంకీర్తన కార్యశాల


NATS: సాయిదత్త పీఠంలో అన్నమయ్య సంకీర్తన కార్యశాల


NATS: సాయిదత్త పీఠంలో అన్నమయ్య సంకీర్తన కార్యశాల


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement

ఓపెన్ హార్ట్Latest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.