3, 4 తేదీల్లో అన్నమయ్య నీటి సరఫరా నిలుపుదల

ABN , First Publish Date - 2021-03-02T05:07:22+05:30 IST

రాజంపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్నమయ్య వాటర్‌ సప్లయ్‌కు వివిధ చోట్ల పైపు లైన్ల మరమ్మతుల కారణంగా రెండు రోజుల పాటు మంచినీటి నిలి పివేయడం జరుగుతుందని మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.జనార్దన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

3, 4 తేదీల్లో అన్నమయ్య నీటి సరఫరా నిలుపుదల

రాజంపేట, మార్చి1 : రాజంపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్నమయ్య వాటర్‌ సప్లయ్‌కు వివిధ చోట్ల పైపు లైన్ల మరమ్మతుల కారణంగా రెండు రోజుల పాటు మంచినీటి నిలి పివేయడం జరుగుతుందని మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.జనార్దన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉస్మాన్‌ నగర్‌, కొలిమివీధి, ఎగువగడ్డ, మన్నూరు, గంగిరెడ్డిపాలెం, ఆర్‌ఎ్‌సరోడ్డు, నూనెవారి పల్లె రోడ్డు, సరస్వతీపురం, ఆకులవీధి, గడ్డివీధి, ముకుందారగడ్డ, అమ్మవారిశాల, ఎర్రబల్లితో పాటు పట్టణంలోని ఇతర ప్రాంతాల్లో కూడా నిలిపివేయడం జరుగుతుందన్నారు. తిరిగి 5వ తేదీ నుంచి యథావిధిగా నీటిని సరఫరా చేయడం జరుగుతుందన్నారు.

Updated Date - 2021-03-02T05:07:22+05:30 IST