సింగపూర్‌లో ఘనంగా అన్నమయ్య శతగళార్చన

ABN , First Publish Date - 2022-05-24T00:11:59+05:30 IST

తెలుగు భాగవత ప్రచార సమితి ఆధ్వర్యంలో 5వ అన్నమయ్య శతగళార్చన మొదటి రోజు కార్యక్రమం సింగపూర్‌లోని సివిల్ సర్వీసెస్ క్లబ్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది.

సింగపూర్‌లో ఘనంగా అన్నమయ్య శతగళార్చన

తెలుగు భాగవత ప్రచార సమితి ఆధ్వర్యంలో 5వ అన్నమయ్య శతగళార్చన మొదటి రోజు కార్యక్రమం సింగపూర్‌లోని సివిల్ సర్వీసెస్ క్లబ్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. మూడుగంటలపాటు నిర్వహించిన ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని యూట్యూబ్ ద్వారా వేలాది మంది వీక్షించారు. మే 22, 2022 అన్నమయ్య జయంతి రోజున మొదలైన ఈ సాంస్కృతిక కార్యక్రమంలో సప్తగిరి సంకీర్తనలు, పిల్లలు పాడిన అన్నమయ్య కీర్తనలు.. అంతర్జాలంలో ఉన్న తెలుగువారందరినీ అలరించాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలనుండి ఎందరో పిల్లలు, పెద్దలు పంపిన 108కి పైగా  కీర్తనలను వారం రోజులపాటు ప్రతిరోజూ సాయంత్రం ఆన్‌లైన్‌లో యూట్యూబ్ ద్వారా ప్రసారం చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. మన సాంస్కృతిక విలువలపై చిన్నారులలో ఆసక్తి పెంచడానికి చేస్తున్న ఈ వార్షిక కార్యక్రమానికి కే విద్యాధరి, చిరంజీవి మౌర్యలు వ్యాఖ్యానాన్ని అందించి ప్రేక్షకులను అలరించారు.


ఈ కార్యక్రమంలో సింగపూర్‌లో ఉంటున్న గాయకులు సప్తగిరి సంకీర్తనలను ఆలాపించగా, చిన్నారి ప్రవాసభారతీయులు 70 మంది 17 పాటలను అందించారు. కాపవరపు విద్యాధరి, శేషుకుమారి యడవల్లి , షర్మిల, శ్రీదేవి నాగేళ్ల తదితర సంగీత గురువులు పిల్లలకు తర్ఫీదునిచ్చి చక్కటి అన్నమయ్య కీర్తనలను మన ముందుకు తీసుకువచ్చారు.  అలాగే, ఈ కార్యక్రమంలో కవుటూరు రత్నకుమార్, అనంత్ బొమ్మకంటి, సురేష్ కుమార్ ఆకునూరి వంటి ప్రముఖులు పాల్గొని పిల్లలను ప్రోత్సహించారు. ఈ అన్నమయ్య శతగళార్చన చక్కగా కూర్పు చేయటంలో సహకరించిన Kai Media వీడియోగ్రఫీ, ఆడియో సహకారం అందించిన శివకుమార్ (వయోలిన్), శివకుమార్ గోపాలన్‌కు(మృదంగం) భాగవత ప్రచార సమితి  హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపింది.  చివరగా ఈ కార్యక్రామాన్ని విజయవంతంగా నిర్వహించిన  తెలుగు భాగవత ప్రచార సమితి సభ్యులందరికి, ముఖ్యంగా నిర్వహణలో సహకరించిన భాగవత బంధువులు, స్వచ్ఛంద కార్యకర్తలు, నిర్వహణ కమిటీ సురేష్ చివుకుల, విద్యాధరి కాపవరపు, రమ్య బొమ్మకంటి, రవితేజ భాగవతుల, చి. మౌర్య ఊలపల్లిలకు కూడా సంస్థ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపింది. 




       అన్నమయ్య శతగళార్చన తదుపరి కార్యక్రమాలను ఈ లింక్ ద్వారా వీక్షించవచ్చు 

           కార్యక్రమం ఫొటో గ్యాలరీ కోసం ఈ కింది లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - 2022-05-24T00:11:59+05:30 IST