లంకకు అన్నామలై..

ABN , First Publish Date - 2022-05-01T12:30:04+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై శనివారం ఉదయం శ్రీలంకకు బయలుదేరి వెళ్ళారు. శ్రీలంకలోని తమిళ ఎంపీల ఆహ్వానం మేరకు ఆయన అక్కడికి వెళ్ళారు. మూడు రోజులపాటు

లంకకు అన్నామలై..

                    - తమిళుల స్థితిగతులపై అధ్యయనం


చెన్నై: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై శనివారం ఉదయం శ్రీలంకకు బయలుదేరి వెళ్ళారు. శ్రీలంకలోని తమిళ ఎంపీల ఆహ్వానం మేరకు ఆయన అక్కడికి వెళ్ళారు. మూడు రోజులపాటు ఆయన తమిళులు అధికంగా నివసించే ప్రాంతాలను సందర్శించి వారి స్థితిగతులను అధ్యయనం చేయనున్నారు. ఆదివారం ఉదయం శ్రీలంక కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న మేడే వేడుకల్లో అన్నామలై ముఖ్య అతిథిగా పాల్గొంటారు. తమిళ ఈలం పోరులో తీవ్రంగా నష్టపోయినవారికి భారత ప్రభుత్వం తరఫున ప్రధాని మోదీ 40 వేల మందికి గృహాలను నిర్మించారు. ఆ నివాసగృహాల్లో శ్రీలంక తమిళులు ప్రస్తుతం ప్రశాంతంగా నివసిస్తున్నారు. ఆ ప్రాంతంలోని కార్మికులంతా మేడే వేడుకలను ఘనంగా జరుపుకోవటం ఆనవాయితీ. ఆ ఏడాది భారత ప్రధాని మోదీ తమకు నివాసగృహాలను నిర్మించి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపేలా మేడే వేడుకలను అట్టహాసంగా జరుపుకోనున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనాలని ప్రధాని మోదీ చేసిన ఆదేశాల మేరకు అన్నామలై ఆదివారం ఉదయం అక్కడి కార్మికులు జరుపుకొనే వేడుకల్లో పాల్గొంటున్నారు. ఇక ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో తమిళుల తాజా పరిస్థితులను అన్నామలై తన పర్యటనలో అధ్యయనం చేయనున్నారు. అక్కడి తమిళ కుటుంబాలను కలుసుకుని వారి కష్టనష్టాలను గురించి వివరాలను కూడా సేకరించనున్నారు. మూడు రోజులపాటు ఆయన శ్రీలంకలో తమిళులు నివసిస్తున్న ప్రాంతాలతోపాటు జాఫ్నా, కొలంబో నగరాల్లోనూ పర్యటించనున్నారు. శ్రీలంక ప్రజల పరిస్థితులకు సంబంధించి కూడా ఆయన తగిన వివరాలను సేకరించనున్నారు. 

Updated Date - 2022-05-01T12:30:04+05:30 IST