ఖరీఫ్‌ సాగుకు అన్నదాత సమాయత్తం

ABN , First Publish Date - 2022-05-24T05:24:28+05:30 IST

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు ఖరీఫ్‌ సాగు కోసం సమాయత్తమవుతున్నారు.

ఖరీఫ్‌ సాగుకు అన్నదాత సమాయత్తం
నారాయణపేట మండలం సింగారం శివారులో పొలాన్ని ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతున్న రైతులు

 - మూడ్రోజులుగా కురిసిన వర్షాలతో కలిసి వచ్చిన

       వేసవి దుక్కులు

-  ముందస్తుగా పత్తి పంట సాగుకు

    సిద్ధమవుతున్న రైతులు

- జిల్లాలో పత్తి 1,82,317  ఎకరాల్లో 

    సాగయ్యే అవకాశం

- విత్తనాల కొనుగోళ్లపై అన్నదాతల గురి 


నారాయణపేట, మే 23: నారాయణపేట జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు ఖరీఫ్‌ సాగు కోసం సమాయత్తమవుతున్నారు. మూడ్రో జులుగా ఓ మోస్తరు వర్షం కురువడంతో అన్నదాతలు  పొలాలను ట్రాక్టర్లతో వేసవి దుక్కిదున్నుల్లో బిజీ బిజీగా కానవస్తున్నారు. వర్షం కురియడంతో దుక్కి దున్నులకు కలిసి వచ్చిందని అన్నదాతలు పేర్కొంటున్నారు. జూన్‌ మొదటి వారంలో ఓ మోస్తరు వర్షం కురిస్తే పత్తి పంటను సాగు చేసేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,82,317 లక్ష ఎకరాల్లో పత్తి పంట సాగయ్యే అవకా శముంది. ఇప్పటికే కొంత మంది రైతులు విత్తనాలను కొనుగోలు చేయడంపై దృష్టిని సారించారు. జిల్లాలో ప్రధానంగా కంది, వరి, పత్తి పంటలను రైతులు సాగు చేస్తారు. ముఖ్యంగా వర్షాధార పంటలపైనే రైతులు ఆధారపడ్డారు. 

జిల్లాలో 4,66,050 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ సాగు ..

నారాయణపేట జిల్లాలోని 11 మండలాల్లో 4,66,050 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగుకు రైతులు సమాయత్తమవుతు న్నారు. వ్యవసాయ శాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరం మేరకు విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచేలా చర్యలపై దృష్టిని కేంద్రీకరించారు. జిల్లాకు 51,912 క్వింటాళ్ల విత్తనాలతో పాటు 66,357 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి జాన్‌ సుధాకర్‌ ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. వరి గత ఏడాది 83,785 ఎకరాల్లో సాగు చేయగా ఆరువేల క్వింటాళ్ల విత్తనాలు వినియోగించారు. ఈ ఏడాది వరి 1,47,651 ఎకరాల్లో సాగయ్యే అవ కాశముండడంతో 44,295 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసర మవుతాయి. కంది గత ఏడాది 1.40 లక్ష ఎకరాల్లో సాగు చేయగా 5,600 క్వింటాళ్ల విత్తనాలు వినియోగించారు. ఈ ఏడాది కంది 1,22,617 ఎకరాల్లో సాగయ్యే అవకాశ ముండడంతో 4,904 క్వింటాళ్ల కంది విత్తనాలు అవసరమవుతాయి. పత్తి గత ఏడాది 2లక్షల ఎకరాల్లో సాగు చేయగా రెండు వేల క్వింటాళ్ల విత్తనాలు వినియోగించారు. ఈ ఏడాది పత్తి 1,82,317 లక్ష ఎకరాల్లో సాగయ్యే అవకాశముండడంతో 1823 క్వింటాళ్ల పత్తి విత్తనాలు అవస రమవుతాయి.  జొన్న గత ఏడాది 6121 ఎకరాల్లో సాగు చేయగా 210 క్వింటాళ్ల విత్తనాలు వినియోగించారు. ఈ ఏడాది జొన్న 5780 ఎకరాల్లో సాగయ్యే అవకాశముండడంతో 231 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయి. రాగులు గత ఏడాది వంద ఎకరాల్లో సాగు చేయగా 80 క్వింటాళ్ల విత్తనాలు వినియోగించారు. ఈ ఏడాది రాగులు 36 ఎకరాల్లో సాగయ్యే అవకాశముండడంతో ఒక క్వింటాళ్ల రాగుల విత్తనాలు అవసర మవుతాయి.  పెసర గత ఏడాది 3609 ఎకరాల్లో సాగు చేయగా 270 క్వింటాళ్ల విత్తనాలు వినియోగించారు. ఈ ఏడాది పెసర 3376 ఎకరాల్లో సాగయ్యే అవకాశముండడంతో 202 క్వింటాళ్ల పెసర విత్తనాలు అవసరమవుతాయి. ఇతర పంటలు గత ఏడాది 2300 ఎకరాల్లో సాగు చేయగా 19.50 క్వింటాళ్ల విత్తనాలు వినియోగించారు. ఈ ఏడాది ఇతర పంటలు 2625 ఎకరాల్లో సాగయ్యే అవకాశముంది. కాగా జిల్లాకు 66,054 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని అధికారులు అంచనా వేశారు. అందులో యూరియా 17,848 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 19,117 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ 20,207 మెట్రిక్‌ టన్నులు, పొటాష్‌ 4,419 మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 3,364 మెట్రిక్‌ టన్నులు, సిటికం పోస్టు 1,099 మెట్రిక్‌ టన్నులు అవసరం కానున్నాయి. 

Updated Date - 2022-05-24T05:24:28+05:30 IST