Abn logo
Nov 30 2020 @ 03:31AM

అన్నదమ్ముల కలయికలో...

ధనుష్‌ కథానాయకుడిగా ఆయన సోదరుడు, సెల్వరాఘవన్‌ కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది. కలైపులి ఎస్‌ థాను నిర్మిస్తున్నారు. సీన్‌ రోనాల్డ్‌ సంగీతం అందిస్తున్నారు. కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం షూటింగ్‌ ముగించి ఆ తర్వాత సెల్వరాఘవన్‌ చిత్రం షూటింగ్‌లో ధనుష్‌ పాల్గొంటారు. 2006లో వచ్చిన ‘పూదుపెట్టాయ్‌’ చిత్రానికి ఽధనుష్‌తో సీక్వెల్‌ తీస్తానని గతంలో సెల్వరాఘవన్‌ ప్రకటించాడు. ఓ ఫంక్షన్‌లో ఽధనుష్‌ కూడా ఆ విషయాన్ని ధృవీకరించారు. ఇప్పటికే కొత్త చిత్రం  కోసం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. లొకేషన్‌ అన్వేషణ మొదలుపెట్టారు. అన్నీ కుదిరాక ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన విడుదల చేస్తారట. ధనుష్‌తో సెల్వరాఘవన్‌కు ఇది నాలుగో చిత్రం అవుతుంది. సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో గతేడాది సూర్య, సాయిపల్లవి జంటగా ‘ఎన్‌జికే’ చిత్రం వచ్చింది. ఇప్పటిదాకా ఆయన మరో చిత్రం చేయలేదు.

Advertisement
Advertisement
Advertisement