అబద్ధపు కేసులు, దాడులకు బెదరం!

ABN , First Publish Date - 2021-10-20T15:20:44+05:30 IST

అబద్ధపు కేసులు, దాడులతో అన్నాడీఎంకేను విచ్ఛిన్నం చేయలేరని అన్నాడీఎంకే ఉప సమన్వయకర్త, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు. సేలం జిల్లా తలైవాసల్‌లో మంగళవారం పార్టీ స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన

అబద్ధపు కేసులు, దాడులకు బెదరం!

                      - అన్నాడీఎంకే ఉప సమన్వయకర్త ఈపీఎస్‌


పెరంబూర్‌(chennai): అబద్ధపు కేసులు, దాడులతో అన్నాడీఎంకేను విచ్ఛిన్నం చేయలేరని అన్నాడీఎంకే ఉప సమన్వయకర్త, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి  పేర్కొన్నారు. సేలం జిల్లా తలైవాసల్‌లో మంగళవారం పార్టీ స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తొలుత మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్‌, జయలలిత విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్నాడీఎంకే ప్రారంభించిన 50 ఏళ్లలో 30 ఏళ్లు అధికారంలో వుందని, మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్‌, జయలలిత చూపిన బాటలో కోటిన్నర మంది కార్యకర్తలతో పార్టీ బలంగా ఉందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కల్లబొల్లి హామీలతో ప్రజలను మభ్యపెట్టి డీఎంకే అధికారం చేపట్టిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 202 నెరవేర్చామని ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పందంగా ఉందన్నారు.  

Updated Date - 2021-10-20T15:20:44+05:30 IST