నర్సుల సేవలు మరువలేనివి

ABN , First Publish Date - 2021-05-13T04:45:51+05:30 IST

రోగులకు నర్సులు అందించే వైద్య సేవలు మరువలేనివని పలువురు వైద్యులు, నేతలు వెల్లడించారు.

నర్సుల సేవలు మరువలేనివి
కోటమిట్టలో నర్సును సన్మానిస్తున్న నిర్వాహకులు

నెల్లూరు(వైద్యం), మే 12: రోగులకు నర్సులు అందించే వైద్య సేవలు మరువలేనివని పలువురు వైద్యులు, నేతలు వెల్లడించారు. బుధవారం ప్రపంచ నర్సింగ్‌ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్‌స్సోర్సింగ్‌, స్టాఫ్‌ నర్సింగ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నర్సింగ్‌ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పలువురు నర్సులకు సన్మానాలు, సత్కారాలు అందచేశారు. కరోనా కారణంగా మరణించిన వైద్య ఉద్యోగులకు నివాళులర్పించారు. కోటమిట్ట పట్టణ ఆరోగ్య కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో స్టాఫ్‌ నర్సులు నర్సింగ్‌ సిబ్బందికి సన్మానం చేశారు. నర్సులు చేస్తున్న సేవలను హంస జిల్లా అధ్యక్షుడు చేజర్ల సుధాకర్‌ కొనియాడారు. కార్యక్రమంలో డాక్టర్‌ అల్లం పునీతా, డాక్టర్‌ మహసిన్‌ సుల్తానా, సీవో తిరుపతయ్య, మహేష్‌, శాంతకుమారి, పెంచలమ్మ, హరిత, మహిత తదితరులు పాల్గొన్నారు. 

జయభారత్‌లో...

నగరంలోని జయభారత్‌ ఆసుపత్రిలో దొడ్ల రుక్మిణమ్మ నర్సింగ్‌ బాలికలు విద్యార్థులకు బొమ్మిశెట్టి వీరరాఘవులు జ్ఞాపకార్ధం రాఘవఛారిటిస్‌ అధినేత పొన్నలూరు సీతారామిరెడ్డి నర్సింగ్‌ డ్రస్‌లను అందచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ రాష్ట్ర నేత, శుభమస్తు షాపింగ్‌ అధినేత బయ్యా శ్రీనివాసులు నర్సులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆసుపత్రి మేనేజర్‌ గురుప్రసాద్‌, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ స్వప్న, డిఫ్యూటీ మేనేజర్‌ వెంకటేష్‌, కృష్ణారెడ్డి, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-13T04:45:51+05:30 IST