కేన్సర్‌ రోగులకు అంకో డాట్‌ కామ్‌ సేవలు

ABN , First Publish Date - 2020-03-28T06:11:19+05:30 IST

లాక్‌డౌన్‌ సమయంలో కేన్సర్‌ రోగులకు సాయం చేసే ఉద్దేశంతో అంకో డాట్‌ కామ్‌ టెలీకన్సల్టేషన్‌ సేవలను ప్రారంభించింది. రోగులు, రోగుల బంధువులు ఇంటి వద్ద నుంచే కాల్‌ చేసి...

కేన్సర్‌ రోగులకు అంకో డాట్‌ కామ్‌ సేవలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): లాక్‌డౌన్‌ సమయంలో కేన్సర్‌ రోగులకు సాయం చేసే ఉద్దేశంతో అంకో డాట్‌ కామ్‌ టెలీకన్సల్టేషన్‌ సేవలను ప్రారంభించింది. రోగులు, రోగుల బంధువులు ఇంటి వద్ద నుంచే కాల్‌ చేసి అంకో సేవలను వినియోగించుకోవచ్చు. 24 గంటలూ  కేన్సర్‌ వైద్య నిపుణుల నుంచి సలహాలు పొందవచ్చు. టెలిఫోన్‌ కాల్‌/వీడియో కాన్ఫరెన్సింగ్‌  ద్వారా ఈ సేవలు పొందవచ్చని కంపెనీ తెలిపింది. టెలికన్సల్టేషన్‌ 20 నిమిషాలు ఉంటుంది.  24 గంటల్లో షెడ్యూల్‌ చేస్తారు. కోవిడ్‌ 19 విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో  కేన్సర్‌ రోగులకు నిరంతర చికిత్స అందజేయాలని భావిస్తున్నామని.. అంకాలజిస్టులు, ఆసుపత్రులతో కలిసి పని చేస్తున్నామని అంకో డాట్‌ కామ్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ రాషీ జైన్‌ తెలిపారు. 

Updated Date - 2020-03-28T06:11:19+05:30 IST