ఆ ఇద్దరి భేటీలో ఆంతర్యమేమిటో..?

ABN , First Publish Date - 2022-05-05T18:29:49+05:30 IST

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఇది నిజం అనిపించారు ‘బుడా’ మాజీ అధ్యక్షుడు, కేపీసీసీ ప్రధాన కార్యదర్శి జేఎస్‌ ఆంజనేయులు, యువ నాయకుడు,

ఆ ఇద్దరి భేటీలో ఆంతర్యమేమిటో..?

బళ్లారి(కర్ణాటక): రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఇది నిజం అనిపించారు ‘బుడా’ మాజీ అధ్యక్షుడు, కేపీసీసీ ప్రధాన కార్యదర్శి జేఎస్‌ ఆంజనేయులు, యువ నాయకుడు, కొర్లగొంది మాజీ జడ్పీటీసీ సభ్యుడు నారా భరత్‌రెడ్డి. వీరిద్దరి మధ్య చాలా కాలంగా మాటలు లేవు. అయితే హఠాత్తు గా బుధవారం ఈ ఇద్దరూ కలిసి చర్చించుకోవడంతో అందరిలోనూ చర్చలు మొదలయ్యాయి. ఈ ఇద్దరూ కాంగ్రెస్‌ యువ నాయకులే. రాజకీయంగా ఉప్పు..నిప్పులా ఇంతకాలం సాగుతూ వచ్చారు. పైపెచ్చు వీరిద్దరూ బళ్లారి సిటీ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత కాలం ఒకరితో ఒకరు కలిసి తిరిగిన దాఖలాలూ లేవు. ఒకే పార్టీ అయినా వారిద్దరూ కలిసిన సందర్భాలు తక్కువే. ఇలాంటి ఈ ఇద్దరూ బుధవారం కలిసి దాదాపు 2 గంటల పాటు రాజకీయంగా చర్చించుకున్నారనే వార్తలు చక్కర్లు కొట్టడం ఫొటోలు వైరల్‌ కావడం చర్చనీయాంశంగా మారింది. నారా సూర్యనారాయణరెడ్డి కాంగ్రెస్‌లో సీనియర్‌ నేత, కేపీసీసీ ఉపాధ్యక్షుడు రాష్ట్ర రాజకీయాల్లో తల పండిన నేత. కేపీసీపీ ఉపాధ్యక్షుడు జేఎస్‌ ఆంజనేయులు కూడా జిల్లా రాజకీయాల్లో పట్టు ఉన్న నాయకుడు. గాలి జనార్దన్‌రెడ్డి అధికారంలో ఉన్న కాలంలో కాంగ్రెస్‌ పార్టీ పరంగా పోరాడిన నాయకుడుగా జేఎస్‌కు పేరు ఉంది. వీరి భేటీపై ఆంతర్య మేమిటో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి..!

Read more