Abn logo
Sep 20 2020 @ 17:31PM

‘నిశ్శ‌బ్దం’ ఓటీటీ విడుదలపై అంజలి అభిప్రాయమిదే

Kaakateeya

హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ ప‌తాకాల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘నిశ్శ‌బ్దం’. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో.. స్వీటీ అనుష్క, మాధవన్‌, అంజలి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల తదితరులు నటించిన ఈ చిత్రం పరిస్థితులన్నీ బాగుండి ఉంటే.. ఏప్రిల్‌ 2నే థియేటర్స్‌లోకి వచ్చేది. కానీ కరోనా కారణంగా.. ఈ చిత్రం విడుదల విషయంలో అనేకానేక వార్తలు నడుమ చివరికి ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది.  ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న అమెజాన్‌ ప్రైమ్‌లో  'నిశ్శ‌బ్దం' సినిమాను విడుదల చేస్తున్నామని చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ చిత్రం ఓటీటీలో విడుదలవ్వడంపై తన అభిప్రాయాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూలో అంజలి తెలిపింది.

ఆమె మాట్లాడుతూ.. ''నిశ్శ‌బ్దం చిత్రాన్ని థియేటర్‌లోనే చూడాలని ఇన్నాళ్లూ వెయిట్‌ చేశాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీ అనేది అందరికీ చేరువైన ఎంటర్‌టైన్‌మెంట్‌ సాధనం. ఇలా చూసుకుంటే ఓటీటీలో విడుదల అవుతున్నందుకు సంతోషంగానే ఉంది. ఎందుకంటే అన్ని కార్నర్స్‌లో ఉన్న ప్రేక్షకులకు సినిమా రీచ్‌ అవుతుంది. థియేటర్‌లో టికెట్‌ కొనుక్కుని చూసేవారికే సినిమా చేరుతుంది.. కానీ ఇలా మాత్రం ఇంట్లో కూర్చుని ఫ్యామిలీ అంతా సినిమా చూసే అవకాశం ఉంటుంది. అలా ఎక్కువ మంది సినిమాని చూడటానికి అవకాశం ఉంటుంది. అందుకే ఓటీటీ విడుదల విషయంలో నాకు సంతోషంగానూ మిక్స్‌డ్ ఫీలింగ్‌ ఉంది..." అని తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement